Site icon NTV Telugu

Rukmini Vasanth : హిట్ కొట్టిన రుక్మిణి వసంత్.. ఊపిరిపీల్చుకున్న ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌

Rukmini Vasanth

Rukmini Vasanth

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌నీల్‌ సినిమాలో హీరోయిన్‌గా ‘రుక్మిణి వసంత్‌ను తీసుకున్నారు. అయితే ఈ విషయం బైటకొచ్చాక రుక్మిణి నటించిన మదరాసి ఫ్లాప్‌ అయింది. అసలు ఈ అమ్మడికి ఈమధ్య కాలంలో హిట్టే లేదు. దీంతో ఈ అమ్మడిపై ఐరెన్‌ లెగ్‌ ముద్రపడింది. కోరి కోరి రుక్మిణిని హీరోయిన్‌గా తీసుకున్నారన్న భయం తారక్‌ ఫ్యాన్స్‌లో వుండిపోయింది. అయితే ఈ భయాన్ని కాంతార చాప్టర్‌ 1 హిట్‌ పోగొట్టింది. 2019లో వెండితెరపైకి అడుగుపెట్టిన రుక్మిణి, రక్షిత్‌శెట్టితో నటించిన ‘సప్త సముద్రాలు దాటి’ క్రేజ్‌ తీసుకొచ్చింది.

Also Read : Tollywood : తెలుగు సినిమాలకు జపాన్‌ ఓ సెంటిమెంట్‌గా మారిపోయిందా?

తమిళంలో ఏక్‌ మూవీలో విజయ్‌ సేతుపతితో జత కట్టింది. ‘మదరాసి’లో శివ కార్తికేయన్‌తో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. దీనికి ముందే తారక్‌తో నటించే అదృష్టం కొట్టేసింది. తనపై పడిన ఫ్లాప్‌ హీరోయిన్‌ ముద్రను రుక్మిణి వసంత్‌ కాంతార చాప్టర్‌1 చెరిపేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కాంతార చాప్టర్‌1 సక్సెస్‌తో తారక్‌ ఫ్యాన్సే కాదు..యశ్‌ అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నాడు. యశ్‌ టాక్సిక్‌లో ఎంతోమంది హీరోయిన్స్‌ను అనుకుని చివరికి రుక్మిణిని సెలెక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్నవన్నీ పాన్‌ ఇండియా మూవీసే కావడం విశేషం. కన్నడ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌కు తెలుగు స్టార్స్‌ కావాలేగానీ.. హీరోయిన్స్‌గా కన్నడ భామలనే తీసుకుంటాడు. ఆల్రెడీ క్రేజీ ఇమేజ్‌ వున్న రుక్మిణి వసంత్‌ను తీసుకున్నాడు దర్శకుడు. ట్రెడిషనల్‌గా.. మోడ్రన్‌గా ఎలా కావాలంటే అలా కనిపిస్తుంది రుక్మిణి. అయితే.. ప్రశాంత్‌ సినిమాల్లో గ్లామర్‌కు చోటు వుండదు. మరి ఎన్టీఆర్‌ పక్కన ఈ కన్నడ అమ్మాయిని ఎలా చూపిస్తాడో మరి.

Exit mobile version