Site icon NTV Telugu

Rukmini : రష్మికలాగే.. రుక్మిణికి కూడా కన్నడిగుల విమర్శలు తప్పవా?

Rashmika Rukmini

Rashmika Rukmini

టాలీవుడ్‌లో కన్నడ హీరోయిన్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. రష్మిక మందన్న, శ్రీలీల లాంటి భామలు ఇక్కడ టాప్ స్టార్స్‌గా ఎదిగారు. అయితే, రష్మిక తన మాతృభాష కంటే తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్న కారణంతో కన్నడ ఆడియన్స్ ఆమెను తరచూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు రుక్మిణి వసంత్ విషయంలో కూడా అదే తరహా చర్చ మొదలవ్వడం విశేషం.

Also Read : Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్’ సెకండ్ సింగిల్ అప్‌డేట్

‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగు కుర్రాళ్ల మనసు దోచుకున్న రుక్మిణి వసంత్, ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్లతో బిజీగా ఉంది. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైన రుక్మిణి, తాజాగా రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవైపు రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’లో నటిస్తూనే, మరోవైపు తెలుగులో వరుసగా గ్లోబల్ ప్రాజెక్టులకు సంతకం చేస్తోంది. టాలీవుడ్ మార్కెట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా బలంగా ఉండటంతో, రుక్మిణి కూడా తన కెరీర్ కోసం తెలుగు సినిమాలకే ఎక్కువ డేట్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె కన్నడ సినిమాలను పక్కన పెడితే, రష్మికలాగే ఆమె కూడా సొంత భాషా ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి రుక్మిణి ఈ రెండు ఇండస్ట్రీలను ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చూడాలి.

Exit mobile version