Site icon NTV Telugu

Rukmini Vasanth : కాంతార బ్యూటీకి మరో తెలుగు ఛాన్స్..

Sharvanandh, Rukmini

Sharvanandh, Rukmini

ప్రజంట్ ఇండస్ట్రీలో బాగా వినపడతున్న పేరులో రుక్మిణీ వసంత్ ఇకరు. కన్నడ చిత్రం ‘సప్త సాగరదాచె ఎల్లో’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తన అందం నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక రీసెంట్‌గా ‘కాంతార: చాప్టర్ 1’లో కనకవతిగా సెన్సేషన్ సృష్టించిన రుక్మిణీ వసంత్ టాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ఇప్పటికే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ఈ భామ, ఇప్పుడు యంగ్ హీరో శర్వానంద్ సరసన మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. సీనియర్ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో రుక్మిణి హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. తన అందం, అభినయంతో ఇప్పటికే కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ, శర్వానంద్‌తో కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక,

Also Read :Rukmini Vasanth : టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌కు రుక్మిణీ వసంత్ గట్టి పోటీ.. సుకుమార్ సినిమాలో ఛాన్స్ ఎవరికో?

ఈ సినిమా కథ విషయానికి వస్తే, తెలియని వయసులో ఆవేశంగా చేసిన ఒక పని వల్ల హీరో జీవితంలో ఎలాంటి డ్రామా చోటుచేసుకుందనే ఆసక్తికర పాయింట్‌తో శ్రీను వైట్ల ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ‘విశ్వం’ తర్వాత ఎలాగైనా ఒక హిట్ అందుకోవాలనే పట్టుదలతో ఉన్న ఆయన, ఈ సినిమాలో ఒక సీనియర్ హీరోను కూడా ఒక కీలక పాత్ర కోసం తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తుండటం, శ్రీను వైట్ల మార్క్ కామెడీతో కూడిన డ్రామా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version