ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శ్యామ్ పూర్ వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బస్సు పడిపోవడంతో ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. అరుపులు కేకలతో పెట్టారు. పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఉట్నూర్ ఆస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమా లేక ఇతర కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.