RS Praveen Kumar : నవంబర్ 30న వార్ వన్ సైడ్ కావలె..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దొరల గడీలను కూలుస్తాం.ఓట్లు మావి సీట్లు మీకా అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బీఎస్పీ పార్టీ రాజ్యాధికార సభ వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు.ఈ సభలో ప్రవీణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ… వికారాబాద్ గడ్డపై ఎందరినో గెలిపించారు.కానీ వికారాబాద్ అభివృద్ధి ఎందుకు నోచుకోలేదో ప్రజలు ఆలోచించాలి అన్నారు. రాష్ట్రంలో అట్టడుగు స్థాయికి చేరడానికి స్థానిక పాలకుల చేత కానీ తనం కాదా..? నిజంగా ఈ ప్రాంతం మీద వారికి చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి చేసేవారు కదా. ఇక పోతే పదేండ్లు పాలించిన కేసీఆర్ సర్కార్ ఉద్యోగులు, పోలీసులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మీ రాజ్యంలో జీతాలు రాక హోంగార్డులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నవంబరు 30వ తేదీన కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీ పార్టీల గువ్వ గుయ్యమనే విధంగా బీఎస్పీకి ఓట్లు వేయాలి. బీర్లు క్వార్టర్లు మా పేదలకు డబ్బులు పదవులు మీకా.. ..? అని ప్రశ్నించారు. మీరు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు కోటీశ్వరులు ఎలా అవుతున్నారు.
కోళ్ల పరిశ్రమలు వాళ్ళకే వస్తున్నాయి.కానీ పేదవాళ్లకు ఎందుకు రావడం లేదు అన్న విషయం ప్రజలు ఆలోచించాలన్నారు.అన్ని కులాలకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన పార్టీ బీఎస్పీ మాత్రమే నన్నారు. బీఎస్పీ పార్టీ అధికారంలోకి ఓస్తే ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం అని బరోసా ఇచ్చారు. బీఆర్ఎస్,కాంగ్రెస్ నాయకులను నమ్మకండి.మీ చేత ఓట్లు వేయించుకొని గెలిచాక వాళ్లకు నచ్చిన పార్టీలో చేరి కోట్లు దండుకుంటారు అని ఆరోపించారు. కేసీఆర్ ఈ ఎన్నికల్లో గద్దె దించాలి. చిరు ఉద్యోగులు,కార్మికులు,కూలీలు ఇచ్చిన విరాళాలతో హెలికాప్టర్‌తో వస్తున్నాను అని సగర్వంగా చెప్పారు. రేపటి రోజున బహుజనులే హెలిక్యాప్టర్లకు ఓనర్లు అవుతారు’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.వికారాబాద్ లో క్రాంతి కుమార్ ఎదుగుతున్నడని తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారు.ఇలాంటి కుట్రలు పన్నే బిఆర్ఎస్ దొంగనా కొడుకులకు ఈ ఎన్నికల్లో మీ ఓటుతో బుద్ధి చెప్పండి.ఈ సారి ఎన్నిక మన తలరాతలు మార్చే ఎన్నిక.ఈ ఎన్నిక కొండ చిలువలకు చలి చీమలకు మధ్య జరిగే ఎన్నిక.కావున ఈ ఎన్నికల్లో చలి చీమలు గెలువాలి.గెలువాలంటే 90 శాతమున్న బహుజనులు వన్ సైడ్ ఏనుగు గుర్తుపై ఓటేసి బీఎస్పీ అభ్యర్తులను గెలిపించాలి అని కోరారు.
Also Read
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
- Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
తాజావార్తలు
-
Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
-
Thaman : ‘ఎల్లమ్మ’ కథపై తమన్ షాకింగ్ కామెంట్స్..
-
Infosys: ఉద్యోగాల ఊస్ట్ సమయంలోనూ ఈ కంపెనీ ఏకంగా కోటి రూపాయల జీతాలు ఎలా ఇస్తోంది?
-
Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!