జీవితం కొన్నిసార్లు ఊహించని మలుపులు తిరుగుతుంది. ఒక చిన్న సంఘటన జీవిత దిశను మార్చివేస్తుంది. అయితే, ప్రస్తుత పరిస్థితిని చూసి ఒక వ్యక్తి భవిష్యత్తును అంచనా వేయడం నిజంగా తప్పే దీనికి ఉదాహరణ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్. ఆయన సీఈవో మాత్రమే కాదు జొమాటో వ్యవస్థాపకుడు కూడా. జొమాటో మొదట్లో నష్టాల్లో కూరుకుపోయినా, ఆ తర్వాత లాభదాయకంగా మారింది. నేడు, జొమాటో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ డెలివరీ యాప్‌గా నిలుస్తుంది. దీనికి కారణం గోయల్ సంకల్పం, కృషి కారణమని చెప్పవచ్చు.
Read Also: Mudragada Padmanabham: పవన్, మీ భాష వల్ల నష్టం తప్ప లాభం లేదు.. లేఖలో ముద్రగడ
పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాలో జన్మించిన దీపిందర్ గోయల్ చిన్నతనంలో తెలివైన విద్యార్థి కాదు. గోయల్ ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. ఇది గోయల్ జీవితంలో సరికొత్త మలుపు తిరిగింది. ఈ సంఘటన అతని జీవితాన్నే మార్చేసింది. ఈ సంఘటన తర్వాత, గోయల్ స్కూల్ టాపర్లలో ఒకడిగా నిలిచాడు.
Read Also: Dowry Harassment: నా భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రిలో శవాన్ని వదిలేసి భర్త పరార్
ఐఐటీ ప్రవేశ పరీక్షకు సిద్ధం కావడానికి గోయల్ కుటుంబం అతన్ని చండీగఢ్ కు పంపించింది. అయితే గోయల్ సరిగా ప్రిపేర్ కాకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే, తర్వాత రోజుల్లో ఐఐటీ ఢిల్లీ పరీక్షలో ఫసయ్యాడు. దీపిందర్ 2005లో ఢిల్లీ ఐఐటీ నుంచి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత తన స్నేహితుడు పంకజ్ చడ్డాతో కలిసి జొమాటోను స్థాపించి గోయల్ తన విజయ యాత్రను స్టార్ట్ చేశాడు.
Read Also: Kia Seltos 2023: కొత్తగా రాబోతోన్న కియా సెల్టోస్.. జూలై 4న ఆవిష్కరణ…
అయితే.. 2021లో జొమాటోలో స్టాక్ మార్కెట్లో లిస్టైన తర్వాత, దీపిందర్ గోయల్ నికర విలువ రూ.5,345 కోట్లకు పెరిగింది. ఆ టైంలో జొమాటోలో అతని వాటా 4.7 శాతంగా ఉంది. కరోనా మహమ్మారి టైంలో జొమాటో డెలివరీ భాగస్వాముల పిల్లల విద్య కోసం దీపిందర్ గోయల్ రూ. 700 కోట్లు విరాళం ఇచ్చారు. దీంతో పాటు గోయల్ జొమాటోలో పనిచేసే మహిళలు-దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన పథకాలను తీసుకొచ్చాడు.
Read Also: Tamannah : ఆ సీన్స్ లో నటించడం పై స్పందించిన తమన్నా..
ప్రస్తుతం గోయల్ జొమాటో నుంచి ఎలాంటి జీతం తీసుకోవడం లేదు. అయితే గోయల్ ఏటా రూ.358 కోట్లు కంపెనీ నుంచి అందుకుంటున్నాడు. అంటే రోజుకు కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు అని అర్థం. జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.66,874 కోట్లు. ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో, గోయల్ తనను తాను జొమాటో డెలివరీ బాయ్ గా పిలిపించుకోవడం ఇష్టమట. ఒక్కోసారి కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేసేందుకు కూడా అతడు వెళ్తుంటారు. దాని ద్వారా సంస్థ పేరును మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.