Dowry Harassment: నా భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రిలో శవాన్ని వదిలేసి భర్త పరార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dowry Harassment: సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్ లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా తరుణం బేగంని వరకట్నం కోసం భర్త సాబేర్ మాలిక్, అత్త మామలు వేధిస్తుండంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు వరకట్నం కోసం గొడవ మొదలయ్యాయి. దీంతో మనసికంగా కుంగిపోయాన తరుణం బేగం ఇంట్లో రాత్రి ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పి సంగారెడ్డి ఆస్పత్రిలో తరుణం బేగం శవాన్ని వదిలేసి భర్త, అత్తమామలు పరార్ అయ్యారు. భర్త, అత్తమామలే 25 వేల రూపాయల కట్నం కోసం చంపేశారని మృతురాలి బంధువుల ఆరోపిస్తున్నారు. మృతురాలికి మూడు సంవత్సరాలు కొడుకు ఉన్నాడు. ఆ బాలుడి పరిస్థితి ఏంటని రోదిస్తున్నారు. తల్లి శవాన్ని చూస్తూ అమ్మకావాలని ఏడుస్తున్న ఆ బాలుడ్ని ఓదార్చ డానికి ఎవరితరం కాలేదు.
సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్ లో సాబేర్ మాలిక్ కుటుంబం నివాసం ఉంటుంది. సాబేర్ మాలిక్ తో తరుణం బేగం ఇచ్చి తల్లి దండ్రులు వివాహం జరిపించారు. అయితే వీరిద్దరి కాపురం కొద్దిరోజులు సజావుగా సాగిన కొద్ది రోజులకు వీరిద్దరి మధ్య వరకట్న వేధింపులు మొదలయ్యాయి. సాబేర్ మాలిక్ తో సహా అత్త మామలు తరుణం బేగంకు డబ్బు తేవాలని వేధించడం మొదలయ్యాయి. అయితే ముందు పుట్టింటి నుంచి తెచ్చిన డబ్బులను అత్త మామమలకు ఇచ్చింది. రాను రాను ఇదే వరుస కొనసాగించారు అత్తింటి వారు. ఇలా సాగుతుండగానే తరుణం బేగంకు బిడ్డ పుట్టాడు. అయితే దీని వల్లైన అత్తింటి వారు మారుతారన్న ఆశతో వున్న తరుణం బేగంకు ఇంకా ఎక్కువయ్యాయి. నీకే కాకుండా నీబిడ్డ కూడా ఇక్కడే ఉండాలంటే మీ ఇంటి నుంచి డబ్బులు తేవాల్సిందే అంటూ వేధింపులు మొదలయ్యాయి. డబ్బులు తీసుకురావాల్సిందే అని భర్త, అత్తమామలు డిమాండ్ చేశారు.
Also Read
- Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
- Bans Non Dairy Paneer: తెలంగాణలో పనీర్‌కు బిగ్ షాక్.. ఏడాది బ్యాన్
- Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
- ED raids : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్‌పై సోదాలు..?
దీంతో సహనం కోల్పోయిన తరుణం బేగం పుట్టింటి వారికి భారం కాలేక ఆత్మహత్య పాల్పడింది. నిన్న రాత్రి భర్త, అత్తమామలు వేధింపులకు తాళలేక ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో భర్త అత్తమామలు తరుణం బేగం మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యా చేసుకుందని అక్కడినే వదిలేసి భర్త, అత్తమామలు పరార్ అయ్యారు. దీనిపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి తరుణం బేగం కుటుంబ సభ్యులకు సమచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న తరుణం బేగం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తరుణం బేగం ఆత్మహత్య చేసుకునేంత పిచ్చిది కాదని, తనని అత్తింటి వారే చంపేశారంటూ ఆరోపించారు. వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. వీరి వరకట్న వేధింపులకు తన కన్న కూతురు చనిపోగా.. మనవడు దిక్కలేకుండా అయిపోయాడని వాపోయారు. వారికి తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు.
Kia Seltos 2023: కొత్తగా రాబోతోన్న కియా సెల్టోస్.. జూలై 4న ఆవిష్కరణ…
తాజావార్తలు
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?