KA Paul : వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు రూ. 4 వేల కోట్లు ఇస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4 వేల కోట్ల రూపాయలు రెడీ చేసా.. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే.. సమస్య తీర్చేస్తా అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4 వేల కోట్లు రెడీ చేసి వచ్చాను.. కేంద్రం అనుమతి ఇస్తే.. సమస్య తొలగినట్టేనని పాల్ తెలిపారు. త్వరలో కేంద్రం నుంచి అనుమతి వస్తుంది.. కుటుంబ కుల రాజకీయాలకు వ్యతిరేకంగా పని చేద్దాం రండి అంటూ ఆయన పిలుపునిచ్చారు. కాపు, బీసీ ఎస్సీలు అందరూ కలిసి రండి..నేను తెలుగు వాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవటానికి కలిసి పనిచేద్దాం రావాలంటూ కేఏ పాల్ అన్నాడు.
Also Read : Junmoni Rabha: మలుపులు తిరుగున్న “లేడీ సింగం” మృతి కేసు.. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు..
Also Read
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
- Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
జేడి లక్ష్మి నారాయణను ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానించానని కేఏ పాల్ తెలిపారు. గద్దర్ లాంటి ప్రజా నాయకులే ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఏపీ-తెలంగాణ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను అంటూ పాల్ చెప్పుకొచ్చాడు. నా ప్రజాశాంతి పార్టీ నుంచి అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని తెలిపారు. ఇదే సందర్బంగా కేఏ పాల్ మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై తన మార్క్ తో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు విశాఖ రావడం అనవసరమన్నారు.
పవన్ పార్టీ అభ్యర్థులకు బుద్ది వచ్చిందా? అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు.
Also Read : CM Jagan: సీఎం జగన్ మానవీయ స్పందన.. వాలంటీర్‌కు ఆర్థిక చేయూత
జనసైనికులు లోకేష్ జెండా మోయకండి.. వంగవీటి రంగా ఆత్మ గోషిస్తుంది అంటూ కేఏ పాల్ సూచించారు. పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తుల వల్లే బీసీలు ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. చంద్రబాబు విశాఖ రావడం అనవసరం..ఆయన సింగపూర్ లో సెటిల్ అయితే మంచిది అంటూ కేఏ పాల్ సలహాలిచ్చారు. కాగా కొన్ని రోజుల క్రితం పాల్ మాట్లాడుతు..స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ కాకుండా ఉండటానికి తాను ప్రాణ త్యాగం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నానంటూ కామెంట్స్ చేశాడు. 4వేల కోట్లు తెచ్చి స్టీల్ ప్లాంట్ కోసం నెల రోజుల్లో డొనేషన్ ఇస్తానని స్టీల్ ప్లాంట్ అప్పుల్లో ఉంటే ఆ అప్పులన్నీ తీర్చేస్తానని ఆయన వ్యాఖ్యనించారు. నేను 5లక్షల కోట్లను తెచ్చా మీరు ఎందుకు స్టీల్ ప్లాంట్ కోసం ఇవ్వలేకపొతున్నారు? అని ప్రశ్నించారు. నా ఫండ్స్ రాకుండా ప్రభుత్వాలు నిలిపివేస్తున్నాయని పాల్ ఆరోపించారు. ఈక్రమంలో గతంలో తాను చేసిన వాగ్ధానానికి కట్టుబడి ఉండి రూ.4వేల కోట్లు రెడీ చేసానంటూ తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పుకొచ్చాడు.
Also Read : Bandi Sanjay : ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ
ప్రధాని మోడీ దగ్గర స్టీల్ ప్లాంట్ పోరాటకమిటీ నేతలు 27 మందిని కూర్చోపెడదామనుకున్నాను అని కేఏ పాల్ అన్నారు. ఏం జరిగిందో తెలీదు వారు రాలేకపోయారు..ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది.. మరోసారి ప్రయత్నించి వారితో మోడీని కలిసే ఏర్పాటు చేస్తాను అంటూ కేఏ పాల్ వెల్లడించారు. బీజేపీ అవినీతి చేస్తోంటే ఏపీలో పార్టీల నేతలు ప్రశ్నించలేకపోతున్నారు.. మరోసారి జగన్ సీఎం అయితే ఏంటి లాభం..నేను కాపు కులంలో పుట్టాను..దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను..కాపు సత్తా చూపించాలి అన్నారు. వాలంటీర్లకు నెలకు ఇచ్చే 5 వేల రూజీతంతో తిండి ఎలా దొరుకుంది.. వాలంటీర్లతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను గెలిపిస్తే తొలిదశలో లక్ష మంది వాలంటీర్లను పర్మినెంట్ ను చేస్తాను అని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ నెలకు లక్ష కోట్ల అప్పు చేస్తున్నారు అంటూ కేఏ పాల్ తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్‌లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!