NTV Telugu Site icon

HCA: హైదరాబాద్ క్రికెట్ జట్టుకు రూ.25 లక్షల ప్రైజ్ మనీ..

Hca

Hca

ఇటీవల తమిళనాడులో జరిగిన ఆల్‌ ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ క్రమంలో.. హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టుకు హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శినపల్లి జగన్‌మోహన్‌ రావు భారీ నజరానా ప్రకటించారు. ఏడేళ్ల తర్వాత టైటిల్ సాధించిన ఆటగాళ్లకు రూ. 25 లక్షల నగదు బహుమతి అందజేస్తున్నట్టు జగన్‌మోహన్‌ రావు ప్రకటించారు.

Read Also: CM Chandrababu: ఏచూరితో కలిసి పని చేశాను.. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నా

గత రంజీ సీజన్‌లో ప్లేట్‌ డివిజన్‌లో అజేయ విజేతగా నిలిచిన హైదరాబాద్‌.. బుచ్చిబాబు టోర్నమెంట్‌లోనూ ఇతర జట్లను చిత్తుగా ఓడించింది. ఈ సందర్భంగా.. జగన్‌మోహన్‌ రావు మాట్లాడుతూ, సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌ జట్టు బుచ్చిబాబు టోర్నమెంట్‌లో విజేతగా నిలవటం సంతోషంగా ఉందన్నారు. గత సీజన్‌లో రంజీ ప్లేట్‌ ఛాంపియన్‌గా నిలిచాం.. ఈ సీజన్‌లో రంజీ ఎలైట్‌ ఛాంపియన్‌గా నిలువాలనేది తన లక్ష్యమని చెప్పారు. ఈ క్రమంలో.. క్రికెటర్లకు, సహాయక సిబ్బందికి అవసరైన సహాయ సహకారాలు హెచ్‌సీఏ అందించేందుకు సిద్ధంగా ఉందని జగన్‌మోహన్‌ తెలిపారు.

Read Also: Matrimonial fraud: మరో మాట్రిమోనియల్ ఫ్రాడ్.. ప్రభుత్వ ఉద్యోగినని మహిళలకు వల..ఆ తర్వాత బ్లాక్‌మెయిల్..

శుక్రవారం(సెప్టెంబర్ 13) ఉప్పల్ స్టేడియం వేదికగా హెచ్‌సీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రికెట్ జట్టు ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా.. హైదరాబాద్‌ టీమ్‌, కోచ్‌ చటర్జీని హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు ఘనంగా సత్కరించారు. కాగా.. ఫైనల్లో ఛత్తీస్‪ఘడ్ జట్టును హైదరాబాద్ జట్టు ఓడించింది. 243 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగుల ఆధిక్యం సాధించగా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే ఆట తీరు కనబరిచింది.

Show comments