RS. 2000 Note Withdrawal: బంగారానికి డిమాండ్ పెంచిన రూ.2 వేల నోటు.. క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం ఎప్పుడైనా బంగారమే. ఈ విషయం జనానికి మరో సారి బాగా తెలిసొచ్చింది. దాచుకోడానికి బంగారాన్ని మించిన సాధనం మరొకటి లేదని అర్థమైంది. 2 వేల రూపాయల నోట్లను RBI చెలామణి నుంచి తొలగించడంతో. కరెన్సీ నోట్ల రూపంలో దాచుకోవడం ఎప్పటికైనా ఇబ్బందేనని తెలిసొచ్చింది. మరో నాలుగు నెలల్లో చిత్తు కాగితాలుగా మారిపోబోతున్న 2 వేల రూపాయల నోట్లను బంగారంలోకి మార్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు. 2 వేల నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్టు RBI ప్రకటించిన వెంటనే.. బంగారం షాపులకు ఎంక్వైరీలు మొదలయ్యాయి. తాము తరచూ బంగారం కొనే షాపులకు ఫోన్లు చేసి బంగారం కొనసానడానికి ఆసక్తి కనబర్చారు కొంత మంది. అయితే, 2 వేల రూపాయల నోట్లతో చెల్లింపులు జరుపుతామని చెప్పినట్టు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా గల జువెలరీ షాపులకు ఈ తరహా ఎంక్వైరీలు వెల్లువెత్తాయి.
Read Also: New Ration Card: కొత్త రేషన్ కార్డుల జారీ లేనట్లే.. పౌరసరఫరాల శాఖ క్లారిటీ
Also Read
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్‌మైండ్!
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్‌కి కేటీఆర్ లేఖ
- Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
2 వేల రూపాయల నోట్లు బంగారంలోకి మార్చుకోడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అయితే, 2016లో నోట్ల రద్దు సమయంలో కనిపించిన ఉధృతి… ఇప్పుడు లేదంటున్నారు జువెలర్స్. ప్రస్తుతం దేశంలో 2 లక్షల రూపాయల లోపు బంగారం, వెండి ఆభరణాలు, రత్నాలు కొంటే పాన్, ఆధార్ వంటి పత్రాలను అందజేయాల్సిన అవసరం లేదు. కానీ… 2 వేల నోట్ల మార్పిడి విషయంలో KYC నిబంధనలు కఠినంగా ఉన్నాయి. దీనిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు బంగారం వ్యాపారులు. 2 వేల రూపాయల నోట్లు మార్కెట్లో చెల్లుబాటు కావనే సాకుతో కొంత మంది బంగారు వ్యాపారులు కస్టమర్ల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసినట్టు తెలుప్తోంది. బంగారం కొనుగోలు కోసం 2 వేల రూపాయల నోట్లు ఇచ్చే కస్టమర్ల నుంచి 5 నుంచి 10 శాతం వరకూ అదనంగా వసూలు చేస్తునట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బంగారం ధర తులం 60 వేల 200 మేర ఉంది. కానీ… కొనుగోలు దారుల నుంచి 10 గ్రాముల బంగారాన్ని 66 వేల రూపాయలకు అమ్మినట్టు సమాచారం.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
గతంలో పెద్ద నోట్ల రద్దుకు… ఇప్పడు 2 వేల రూపాయల నోటు రద్దు మధ్య చాలా వ్యత్సాసం ఉంది. ఈ సారి నోట్లును మార్పిడి చేసుకోడానికి చాలా సమాయం ఇచ్చింది. సెప్టెంబర్ 30 వరకూ వాటిని బ్యాంకులో డిపాజిట్ చేసుకునే వీలుంది. లేదా బ్యాంకుల్లో వాటిని మార్చుకోడానికి వీలుంది. అయితే, 2 వేల రూపాయల నోట్లకు బదులుగా ఇతర కరెన్సీ నోట్లును తీసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే, 2 వేల రూపాయల నోట్లు పెద్ద మొత్తంలో ఉన్న వాళ్లకు మాత్రం బంగారంలోకి మార్చుకోడానికే ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో బంగారానికి ఒక్క సారిగా డిమాండ్ పెరిగిపోయింది. తమ దగ్గర ఉన్న 2 వేల రపాయల నోట్లను మార్చుకోడానికి బంగారం ఒక్కటే సరైననది చాలా మంది భావిస్తున్నారు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న చాలా మంది వ్యాపారులు 2 వేల రూపాయల నోట్ల తో కొనే బంగారం ఆభరణాలకు ఎక్స్ఛేంజి ప్రిమియం విక్రయాలు జరిపారు.
తాజావార్తలు
-
OPPO Find X9 Ultra: 200MP కెమెరా, 7050mAh బ్యాటరీతో.. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా రిలీజ్
-
SpaceX IPO: స్పేస్ఎక్స్ IPOతో ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ అవుతారా?.. ప్రపంచ దృష్టి నాస్‌డాక్‌పై
-
Ram Charan: నీకో దండం బుచ్చి.. నన్ను బాగా టార్చర్ చేశావ్!
-
Apple: ఆపిల్ వాచ్ & ఎయిర్‌పాడ్స్ ప్రోలో.. కొత్త ఆరోగ్య ఫీచర్లు వచ్చేశాయ్!
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!