Site icon NTV Telugu

Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. డబుల్ బోనస్ బొనంజా

Singarani

Singarani

Singareni: తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. ప్రతేడాది మాదిరే ఈ సారి కూడా దీపావళి పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు యాజమాన్యం దీపావళి బోనన్ అందించనుంది. రూ.296 కోట్లు కార్మికులకు బోనస్‌గా అందజేస్తామని సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఒక్కో కార్మికుడికి 72,500 నుంచి గరిష్టంగా రూ.76,500 బోనస్ అందించనున్నారు. ఈ నగదు అక్టోబర్ 21న వారి ఖాతాల్లో జమ కానుంది.

Read Also: Girl Kisses Cheetah: చిరుతతో యువతి ముద్దులాట.. ఎంతో ఘాటు ప్రేమయో..!

సింగరేణి సాధించిన లాభాల్లో 30 శాతం(రూ.368 కోట్లు) వాటాను ఉద్యోగులకు దసరా పండుగ కానుకగా అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా జమచేసే బోనస్ అందుకు అదనం. దసరా , దీపావళి బోనస్‌ల చెల్లింపునకు సింగరేణి రూ.664 కోట్లను వెచ్చిస్తుంది. అంతేగాక పండుగ అడ్వాన్స్ కింద ప్రతి కార్మికుడికి రూ.25 వేలు ప్రకటించింది. రెండు రకాల బోనస్‌లు, పండుగ అడ్వాన్స్ కలిపి ఒక్కో కార్మికిడికి సగటున రూ. లక్షా 60 వేల వరకూ రానున్నాయని సింగరేణి యాజమాన్యం తెలిపింది. దీనికి సంబందించిన ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే చేశారు.

Read Also: Premi Vishwanath: వెండితెరపై వంటలక్క.. ‘కార్తీక దీపం’ మళ్లీ మునిగినట్టే..

మొత్తం సింగరేణి కార్మికులు 43,895 మంది ఉండగా.. అందరికి దీపావళి బోనస్ కింద రూ.72,500 ఇస్తారు. గరిష్టంగా రూ.76,500 పొందే అవకాశముంది. ఇందుకు సింగరేణి సంస్థ బడ్జెట్‌ సిద్ధం చేసింది. ఆ డబ్బులను ఈ నెల 21న కార్మికుల ఖాతాల్లో జ‌మయ్యే విధంగా త‌క్షణ చ‌ర్యలు తీసుకోవాల‌ని సింగ‌రేణి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగాన్ని ఆదేశించింది. బొగ్గు కార్మికుల కుటుంబసంక్షేమం కోసం పొదుపు చేసుకోవాలని సింగరేణి సీఎండీ సూచించారు. అందరూ కష్టపడి పనిచేస్తే.. ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించవచ్చని అన్నారు. ఈ ఏడాది సైతం 700 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించాలని సింగరేణి కార్మికులకు సింగరేణి సీఎండీ శ్రీధర్ సూచించారు.

Exit mobile version