RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. అలాగే ఈ సినిమాలో అలియాభట్, అజయ్ దేవ్‌గన్, శ్రియాశరణ్, ఒలివియా మొర్రీస్, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రముఖులు అలాగే పలువురు రాజకీయ వేత్తలు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. దర్శకుడు రాజమౌళి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీగా ప్రమోషన్స్ నిర్వహించారు. అంతేకాదు ఎంతో ప్రతిష్టాత్మక అవార్డు అయిన ఆస్కార్ అవార్డు కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకు దక్కింది. ఈ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ గ్లోబల్ స్టార్స్ గా మారారు.
Read Also: Yahya Sinwar: హమాస్ చీఫ్ సిన్వర్ చివరి క్షణాలు.. నెట్టింట వీడియో వైరల్
ఈ ఇండియన్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా ఇది కాగా ఈ చిత్రం ఎన్నో వండర్స్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా మన దేశంలో రన్ ఏమో కానీ జపాన్ దేశంలో అయితే మన దగ్గర కంటే భారీ లాంగ్ రన్ చూసింది. అక్కడ ఏకంగా ఏళ్ల తరబడి రన్ అవుతుంది. అలా లేటెస్ట్ గా మేకర్స్ ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ మూమెంట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. జపాన్ లోని ఒక హిస్టారికల్ థియేటర్ లో RRR సినిమా ఏకంగా ఒక సంవత్సరం 9 నెలలు(21నెలల పాటు) నిర్విరామంగా రన్ కావడం ఎంతో ఆనందంగా.. ఒకింత ఎమోషనల్ గా కూడా ఉందని వారు చెప్పుకొచ్చారు. మరి ఈ రేంజ్ లో ఓ భారతీయ సినిమా అందులోని మన తెలుగు సినిమా రన్ కావడం అనేది చిన్న విషయం అయితే కాదు.
Read Also:KTR Tweet: మూసీ మురుగులో పొర్లుతూ అందరికీ బురదను అంటించాలని.. కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్
塚口サンサン劇場71年の歴史において、連日上映1年9ヵ月という前人未到の超絶ロングランを記録したあの二人が帰ってくる!『#RRR』を明日より1週間限定上映!何度見ても面白い!何度見ても大興奮!何度見てもまた見たい!
上映時間▶️12:25/18:00~
10月19日(土)#お帰りナートゥ は完売! pic.twitter.com/ak2lBkOJLB— 塚口サンサン劇場 (@sunsuntheater) October 17, 2024