NTV Telugu Site icon

RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త జెర్సీ లీక్.. ఫొటో ఇదిగో

Kohli

Kohli

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఇదొక శుభవార్త. ఆర్సీబీ (RCB) కొత్త జెర్సీ లీక్ అయింది. ఈ జెర్సీని ఆర్సీబీ రివీల్ చేయాల్సి ఉండగా.. జెర్సీ లీక్ అయిపోయింది. ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కొత్త జెర్సీలో కనిపిస్తున్నారు. కోహ్లీ తన జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరోవైపు కోహ్లి, సిరాజ్‌లు కొత్త జెర్సీ ధరించిన ఫొటో వైరల్‌ అవుతోంది.

RCB జెర్సీ ఎలా ఉంటుంది?
ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ చెన్నై-బెంగళూరు మధ్య మార్చి 22న జరగనుంది. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే.. WPL 2024 ట్రోఫీని కూడా ఆర్సీబీ గెలుచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్సీబీపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇంతలో.. ఆర్సీబీ కొత్త జెర్సీ గురించి చర్చ ప్రారంభమైంది. విరాట్ కోహ్లి, సిరాజ్ ధరించిన జెర్సీలో సగం నీలిరంగు, సగం ఎరుపు రంగులో ఉండడం గమనించవచ్చు. ఇందులో బెంగుళూరు లోగో, ప్రకటనల కోసం అనేక కంపెనీల పేర్లు కూడా ఉన్నాయి. ఆర్‌సీబి జట్టు ఈ జెర్సీ ధరించి ఆడుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఇంకా రాలేదు.

తొలి మ్యాచ్ చిన్నస్వామిలో జరగనుంది
ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్ మార్చి 22న బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరు నుంచి భారీ సంఖ్యలో ప్రేక్షకులు రానున్నారు. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కాగా, మరో వైపు తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవాలని కలలు కంటున్న జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగనుంది. బెంగళూరు వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కూడా 2 నెలల తర్వాత తిరిగి వచ్చాడు. దీంతో తొలి మ్యాచ్‌పై అభిమానుల మదిలో ఉత్కంఠ మరింత పెరిగింది. తొలి మ్యాచ్‌లోనే తమ అభిమాన ఆటగాడు విరాట్ కోహ్లిని చూసే అవకాశం అభిమానులకు లభిస్తుంది.

ఆర్సీబీపై అభిమానుల అంచనాలు పెరిగాయి
ఆర్‌సీబీ పురుషుల జట్టు తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుస్తుందని బెంగళూరులోని కోట్లాది మంది అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సీజన్‌లో మహిళల ప్రీమియర్ లీగ్‌లో బెంగళూరు ఫైనల్లో ఢిల్లీని ఓడించి బెంగళూరు ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంతో మహిళల జట్టు.. ఆర్సీబీ అభిమానుల 16 ఏళ్ల కలను నిజం చేసింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ సేన తొలి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఉవిళ్లూరుతుంది.