Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఏం తేల్చిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. సోమవారం రౌస్ అవెన్యూ కోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఈడీ తరపున న్యాయవాదులు-కవిత తరపున న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు వినిపించారు. అనంతరం బెయిల్ పిటిషన్ విచారణ ఏప్రిల్ 4కు న్యాయస్థానం వాయిదా వేసింది. గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు విచారించనుంది. ఇక ఈడీ రిప్లై రిజాయిన్డర్‌కు కవిత తరపు లాయర్ సమయం కోరారు. ఏప్రిల్ 3 సాయంత్రానికి రిజాయిన్డర్ దాఖలు చేస్తామని కవిత తరపు న్యాయవాదులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Hrithik – NTR: డాన్స్‌లో సమ ఉజ్జీల సమరం అంటే ఏంటో చూస్తారు.. గెట్ రెడీ!
Also Read
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్‌పై కోచ్ సంచలన ప్రకటన..
తన కుమారులకు పరీక్షలు జరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని ధర్మాసనాన్ని కవిత కోరారు. దీంతో న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. కవిత బెయిల్‌పై ఈడీ తన సమాధానం ఇచ్చింది. మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్‌పై రెండింటికీ ఈడీ తన వాదనలు వినిపించింది. ఇక కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఎలాంటి బెయిల్ కావాలని కోరుకుంటున్నారో.. తేల్చుకోవాలని అభిషేక్ సింఘ్వీకి న్యాయస్థానం సూచించింది. విచారణను కోర్టు ఏప్రిల్ 4కు వాయిదా వేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: Chandrababu: టీడీపీ కేడర్‌తో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. పింఛన్లపై కీలక ప్రకటన
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు హైదరాబాద్‌లో ఆమె నివాసంలో కవితను అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానం ఈడీ కస్టడీకి అప్పగించింది. తిరిగి కోర్టులో హాజరపరచగా జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వడంతో కవితను తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం కవిత ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఏం తేల్చిందంటే..!
ఇదిలా ఉంటే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయన్ను తీహార్ జైలుకు అధికారులు తరలిస్తున్నారు. ఇక జైల్లో చదవుకునేందుకు రామాయణం, భగవద్గీత, జర్నలిస్టు నీరజా ఛౌదరీ రాసిన హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ వంటి పుస్తకాలు జైల్లో అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ మేరకు కేజ్రీవాల్ తన న్యాయవాది ద్వారా అప్లికేషన్ సమర్పించారు. అలాగే ఒక బల్ల, కుర్చీ, మెడిసిన్స్, డైట్ ప్రకారం ఆహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. తన ఒంటిపై ఉన్న లాకెట్‌ను కొనసాగించేందుకు అనుమతించాలని కోరారు.
Rouse Avenue Court adjourns the arguments on bail of K Kavitha on April 4 after hearing initial submissions.
The court asks senior advocate Abhishek Manu Singhvi to decide whether he wants to argue on the interim or final bail
— ANI (@ANI) April 1, 2024
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్‌లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!