Site icon NTV Telugu

Roslin: దృశ్యం డైరెక్టర్ నుండి మరో థ్రిల్లర్.. ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న మీనా ‘రోజలిన్’!

Roslin

Roslin

Roslin: ప్రముఖ నటి మీనా, నటుడు వినీత్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ‘రోజలిన్’ (Rosalin). ఈ సిరీస్‌కు సుమేష్ నందకుమార్ దర్శకత్వం వహించగా, ‘దృశ్యం’ వంటి సంచలన చిత్రాల దర్శకుడు జీతు జోసెఫ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. ఆయన పర్యవేక్షణలో రూపొందడం వల్ల ఈ సిరీస్‌పై సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

VFX vs AI: టెక్నాలజీ పెరిగినా తప్పని వివరణలు.. సినిమా మేకర్స్ కి ఏఐ టెన్షన్స్!

అత్యంత ఉత్కంఠభరితంగా రూపొందిన ‘రోజలిన్’ (Roslin) వెబ్ సిరీస్ ఫిబ్రవరి 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జియో హాట్‌స్టార్ (Jio Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు.. మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది బెస్ట్ ఛాయస్ గా నిలుస్తుంది.

ఈ కథ 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి రోజలిన్ చుట్టూ తిరుగుతుంది. ఆమెకు చాలా కాలంగా ఒకే రకమైన పీడకలలు వస్తుంటాయి. ఆ కలలో ఆకుపచ్చ కళ్లున్న ఒక అపరిచితుడు తనను వెంబడిస్తున్నట్లు కనిపిస్తాడు. ఈ భయంతో రోజలిన్ తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతుంది. అయితే రోజలిన్ భయాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు (మీనా, వినీత్) అది కేవలం ఆమె భ్రమ అని, టీనేజ్ వయసులో వచ్చే సాధారణ కలలని కొట్టిపారేస్తారు.

Adulterated Milk: కల్తీ పాల ఘటనలో 11 మంది పరిస్థితి విషమం.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

అయితే రోజలిన్ కలలో చూసిన వ్యక్తే ఒకరోజు అనుకోకుండా వారి ఇంటికి అతిథిగా రావడంతో కథలో అసలైన సస్పెన్స్ మొదలవుతుంది. ఆ అపరిచితుడు ఎవరు? కలలో కనిపించిన వ్యక్తే నిజంగా ఇంటికి ఎందుకు వచ్చాడు? అతని అసలు ఉద్దేశ్యం ఏంటి? తనను చూసి భయపడుతున్న రోజలిన్, ఆ వ్యక్తి నిజంగా ప్రమాదకారి అని తన తల్లిదండ్రులకు ఎలా నిరూపించింది? అనే అంశాలను దర్శకుడు చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఇంకెందుకు ఈ వీకెండ్ లో ఫ్యామిలీతో పాటు ఈ థ్రిల్లర్ సిరీస్ ను ఎంజాయ్ చేసేయండి.

Exit mobile version