Rose Flower: అమ్మబాబోయ్.. ఈ గులాబీల ధరతో మూడు సినిమాలను తియ్యొచ్చు తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాములుగా గులాబీల ధరలు పది, ఇరవై లేదా యాభై, ఇంకా ఎక్కువ అంటే రెండు వందలు ఉంటాయి.. కానీ గులాబీల ధరలు కోట్లు ఉండటం ఎప్పుడైనా విన్నారా.. ఏంటి గులాబీల ధరలు అన్ని కోట్లా అనే సందేహం వస్తుంది కదా.. కానీ ఇది నిజం..ప్రపంచంలో ఖరీదైన వస్తువులు చాలా ఉన్నాయి. వాటిని సామాన్యులు కొనలేని పరిస్థితి ఉంటుంది. అలాగే.. ధనవంతులు సైతం కొనడానికి ఆలోచించే కాస్ట్లీ వస్తువులు కూడా ఉంటాయి. రోల్స్ రాయిస్, బుగాటీ, మెర్సిడెస్, లంబోర్గినీ వంటి కార్ల కంపెనీల గురించి వినే ఉంటారు.
ఆ కార్ల ధర బిలియన్లలో ఉంటుంది. వీటిని కొనడానికి బిలియనీర్లు సైతం 10 సార్లు ఆలోచిస్తారు. అయితే, అవి కార్లు కాబట్టి అంత మొత్తం ఉంటుందని భావించొచ్చు.. కోట్లు పలుకుతున్న ఈ గులాబీలు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పూలుగా నిలిచాయి.. ఈ గులాబీని పువ్వును జూలియట్ రోజు అని పిలుస్తారు. దీని ధర తెలిస్తే మీరు కోటీశ్వరులైనా.. కొనడానికి పలుమార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే.. ఆ పువ్వు కొనడానికి భారీగా వెచ్చించాల్సి ఉంటుంది.. ఒక్క జూలియట్ రోజ్ ధర రూ.130 కోట్లు. అయితే, దీనికి ఇంత ధరనా? అని మీరు అనుకోవచ్చు. కానీ, ఇందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. ఆ కారణంగానే ఆ పువ్వుకు భారీ ధర ఉంది. మరి ఆ పువ్వు ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
మాములుగా రోజా పువ్వులు విరివిగా పూస్తాయి. కానీ, ఈ జూలియట్ రోజ్ మాత్రం చాలా స్పెషల్. ఇది పెరగడానికి సుమారు 15 సంవత్సరాలు పడుతుంది.. ఈ పువ్వు పూసే లోపు మొక్క కూడా ఎండిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువే.. ఈ గులాబీని మొదటిసారిగా డేవిడ్ ఆస్టిన్ అనే వ్యక్తి ఒక ప్రయోగంగా పెంచాడు. ఇతను దానిని 2006 సంవత్సరంలో పెంచాడు. ఈ ప్రత్యేకమైన గులాబీని పెంచడానికి, అతను అనేక జాతుల గులాబీలను మిళితం చేసి, ప్రయోగాలు చేశాడు. ఈ ప్రయత్నంలో అతను విజయం సాధించాడు. దీన్ని పెంచేందుకు దాదాపు 37 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. అయితే, ఈ పువ్వుకు జూలియట్ రోజ్ అని పేరు పెట్టాడు. ఇలా పెరిగిన జూలియన్ రోజ్ ఫ్లవర్‌ను డేవిడ్ ఆస్టిన్ రూ.90 కోట్లకు క్రయించినప్పటికీ ఇప్పుడు అది రూ.130 కోట్లు పలుకుతుంది..
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!