Valentine Day : ప్రేమికుల రోజు గులాబీలకు ఫుల్ డిమాండ్.. కోట్లకొద్ది ఎగుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Valentine Day : ప్రేమికుల రోజును ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రజలు గులాబీ పువ్వులు లేదా గులాబీ బొకే ఇచ్చి వారి ప్రేమను ఆశ్చర్యపరుస్తారు. వాలెంటైన్స్ వీక్ నుండి ఫిబ్రవరి 14 వరకు గులాబీలకు మంచి డిమాండ్ ఉంది. దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఈ డిమాండ్ ఉంది. భారతదేశంలో ఎక్కువ శాతం గులాబీలను కర్ణాటకలో పండిస్తారు. అందుకోసం దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా అక్కడి నుంచే గులాబీలు సరఫరా అవుతాయి. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక్క బెంగళూరు విమానాశ్రయం నుంచే దాదాపు మూడు కోట్ల గులాబీలు రవాణా అయ్యాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. గతేడాది కంటే ఇది 108 శాతం ఎక్కువ.
Read Also:Gold Price Today : పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు..
Also Read
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
బెంగళూరు విమానాశ్రయాన్ని నడుపుతున్న సంస్థ ప్రకారం.. ఈ సంవత్సరం ప్రేమికుల రోజున 29 మిలియన్ల గులాబీలు రవాణా చేయబడ్డాయి. దాని మొత్తం బరువు 1,222,860 కిలోలు. గతేడాది ఈ విమానాశ్రయం నుంచి 15.4 మిలియన్ల గులాబీలను పంపించారు. అంటే గతేడాది కంటే ఈ ఏడాది 108 శాతం ఎక్కువగా గులాబీలు పంపించారు. పంపిన సుమారు మూడు కోట్ల గులాబీ కాండాల్లో రెండు కోట్ల గులాబీలను భారతీయ నగరాలకు పంపగా 90 లక్షల గులాబీలను విదేశాలకు పంపారు.
Read Also:Save The Tigers : సేవ్ ది టైగర్స్ సీజన్ 2 పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
బెంగళూరు గులాబీలకు దేశ విదేశాల్లో డిమాండ్ పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 14 శాతం ఎక్కువ గులాబీలను విదేశాలకు పంపించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది కూడా 148 శాతం ఎక్కువ గులాబీలను భారతీయ నగరాలకు పంపారు. విదేశాలకు అత్యధికంగా గులాబీలు కౌలాలంపూర్, సింగపూర్, కువైట్, మనీలా, షార్జాలకు చేరాయి. దేశీయ విమానాశ్రయాలలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, గౌహతి, జైపూర్‌లకు వాలెంటైన్స్ డేకి ముందు బెంగళూరు నుండి గులాబీలు పంపబడ్డాయి. ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ బ్లింక్‌ఇట్‌లో ప్రతి నిమిషానికి 350 గులాబీలకు ఆర్డర్లు అందుతున్నాయి.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!