Viral Video : కొడుకుకు నరకం చూపిన తల్లి.. మీద కూర్చొని, తల నేలకేసి కొడుతూ..ఛాతిపై కొరుకుతూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video : ఉత్తరాఖండ్‌లోని రూర్కీలోని ఝబ్రేదాలో ఓ క్రూరమైన తల్లి తన బిడ్డను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లి కూడా తన బిడ్డను ఇలా ఇంత దారుణంగా కొట్టగలదన్న విషయం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. వాస్తవానికి ఒక తల్లి తన పిల్లలకు ఏ చిన్న ఆపద ఎదురైనా తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కాపాడుకుంటుంది. కానీ ఈ వీడియోలో తల్లి తన 12 ఏళ్ల చిన్నారిని ప్రాణాలు పోయేలా కొట్టడం చూసి అందరూ నీలో ఎంత క్రూరత్వం దాగుంది అంటూ తిట్టిపోస్తున్నారు.
ఓ తల్లి తన బిడ్డ పట్ల క్రూరంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజలు వీడియోను షేర్ చేసి తల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీడియో వైరల్ కావడంతో, విషయం పోలీసులకు చేరింది. వారు తల్లిని సంప్రదించారు. తల్లి, తన బిడ్డను ఎందుకు ఇంత దారుణంగా కొట్టిందని ప్రశ్నించారు. ఈ రెండు నిమిషాల వైరల్ వీడియోలో ఒక మహిళ తన 12 ఏళ్ల బిడ్డను దారుణంగా కొట్టడం కనిపిస్తుంది. ఆ మహిళ అతడిని దారుణంగా కొట్టడమే కాకుండా అతని ఛాతీపై కూర్చొని తన తలను నేలపై కొట్టడం కూడా వీడియోలో కనిపిస్తుంది, తన తల్లి కొట్టిన దెబ్బతో బాధపడిన పిల్లవాడు పదే పదే నీరు అడిగాడు, కానీ ఆ స్త్రీ నీరు ఇవ్వడానికి బదులుగా అతడిని మరింత కొట్టింది.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
Read Also:AP Crime: బిస్కెట్ల ఆశచూపి.. ఎనిమిదేళ్ల బాలికపై అఘాయిత్యం..! ఆపై హత్య..
చిన్నారిని కొడుతున్న సమయంలో మరొకరు వీడియో తీశారు. ఆ మహిళ ఝబ్రేదాలోని బట్టల దుకాణంలో పని చేస్తుంది. వీడియోతోపాటు ఆమె పేరు, చిరునామా కూడా తెలిసింది. ఝబ్రేదా పోలీసులు విచారణ కోసం మహిళ వద్దకు చేరుకున్నప్పుడు, ఆమె వీడియో చూసి ఆశ్చర్యపోయింది. ఝబ్రేదా పోలీస్ స్టేషన్ ఇంఛార్జి అంకుర్ శర్మ మాట్లాడుతూ. విచారణ కోసం ఆమె ఇంటికి వెళ్లినప్పుడు తల్లి ఇల్లు ఝబ్రేదాలో ఉందని.. తనకు దేవబంద్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగిందని తేలింది. ఇప్పుడు ఇద్దరూ విడివిడిగా నివసిస్తున్నారు. దాడి గురించి పోలీసులు మహిళను అడగగా.. మహిళ తన ముగ్గురు పిల్లలతో ఝబ్రేదాలో నివసిస్తుంది. పిల్లల ఖర్చుల కోసం తన భర్త నుండి డబ్బు కావాలని, అతను ఇవ్వడం లేదని వెలుగులోకి వచ్చింది. పిల్లల ఖర్చుల కోసమే తల్లి కొడుకును కొడుతున్న వీడియోను భర్తకు పంపింది. భర్త ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేశాడు.
ఈ కేసును చైల్డ్ వెల్ఫేర్ పర్యవేక్షణలో ఉంచుతామని, అందుకే చైల్డ్ వెల్ఫేర్‌కు పంపామని పోలీసులు తెలిపారు. చిన్నారిని మహిళ ఈ విధంగా కొట్టడంతో.. మహిళకు కౌన్సెలింగ్ అవసరమని పోలీసులు తెలిపారు. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసేందుకు కౌన్సెలింగ్ ఇస్తారు. ఎంత కోపం ఉన్నప్పటికీ ఓ తల్లి ఇంతలా బిడ్డను కొట్టలేదని, ఇలాంటి కసాయి తల్లిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also:Dheeraj Mogilineni : చిన్న సినిమాలకు ఇక నుండి ఒకటే రూల్ ..అదేమంటే..?
क्या दुनिया में माँ ऐसी भी होती हैं?
रूह कंपा देने वाली वीडियो 😡😡90 KG की महिला अपने छोटे 25 KG बेटे के ऊपर बैठकर उसे मुक्कों, दांतों सर पटकना गाला दबाना !!
एक मासूम छोटा बच्चा वहीं पर खड़ा देख रहा!
अगर ये सच है तो इसको जल्द गिरफ्तार करे !! #viralvideo #up #uttrakhand pic.twitter.com/NCZzsihfCw— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) July 17, 2024
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!