Roller Coaster: రోలర్ కోస్టర్ స్ట్రక్.. మూడు గంటలు తలకిందులుగా నరకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Roller Coaster: ఆదివారం సెలవు దినం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను సరదాగా బయటికి తీసుకెళ్తారు. అలా ఎక్కడైనా ఎగ్జిబిషన్ జరుగుతుండగా రోలర్ కోస్టర్ ఎక్కారా.. అది ఆకాశాన్ని చూడటం పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా చాల ఇష్టం. ఎందుకంటే అంత ఎత్తులో థ్రిల్‌ని అనుభవించే మజా వేరేలా ఉంటుంది. కానీ ఆకాశమంత ఎత్తుకు వెళ్లడం కూడా కొన్ని సార్లు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. అలాంటి వీడియో ఒకటి అమెరికాలోని విస్కాన్సిన్ నుండి బయటకు వచ్చింది. ఈ వీడియో చూసిన జనాలకు చెమటలు పట్టాయి. ఎందుకంటే ఒక తప్పు ప్రాణాంతకం. ఒక ఎగ్జిబిషన్లో రోలర్ కోస్టర్ పనిచేయకపోవడంతో పిల్లలు మూడు గంటలపాటు గాలిలో వేలాడదీయబడ్డారు. ఈ ఘటన చూసి ఘటనా స్థలంలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రాణనష్టం జరగకుండా చూడాలని అందరూ దేవుడిని వేడుకున్నారు.
Read Also:Delhi: ఢిల్లీలో ఎన్కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ కాంట్రాక్ట్ కిల్లర్ అరెస్ట్..
Also Read
- Amit Shah : కాంగ్రెస్‌ను గద్దె దించడమే లక్ష్యం.. చొరబాటుదారులను తరిమికొడతాం
- Cyclone Murasu: ముంచుకొస్తున్న మురసు.. కీలక హెచ్చరికలు జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ..
- Imran Khan: అమెరికా పౌరుడిగా ఉంటూ భారత్‌లో నిరసనలా?.. నటుడిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు!
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఆందోళనలు.. ఢాకాలో తీవ్ర హింస.
Eight people hung upside down for about three hours, stuck in a roller coaster-like attraction.
Emergency happened at a festival in American Wisconsin. Local media write that seven of the eight stranded are children. According to preliminary data, everyone got off with fright. pic.twitter.com/OP3Ow3syQZ— Sasha White (@rusashanews) July 4, 2023
ఫారెస్ట్ కౌంటీ ఫెస్టివల్ ఆదివారం విస్కాన్సిన్లోని క్రాండన్లో జరిగింది. ఈ జాతరలోని రోలర్ కోస్టర్ రైడ్ చేస్తుండగా ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో ఏడుగురు చిన్నారులతో సహా మొత్తం ఎనిమిది మంది రైడర్లు దాదాపు మూడు గంటలపాటు గాలిలో తలకిందులుగా వేలాడుతూ ప్రాణాలు విడిచారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ట్విట్టర్లో @rusashanews హ్యాండిల్ నుండి Sasha White అనే వినియోగదారు భాగస్వామ్యం చేసారు. ఈ సంఘటన తర్వాత అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. గాలిలో వేలాడుతున్న వారిని కిందికి దించేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చిక్కుకున్న వారిని జవాన్లు సురక్షితంగా బయటకు తీశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. రోలర్ కోస్టర్ పాడవడానికి సాంకేతిక లోపమే కారణమని చెబుతున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది మంది వీక్షించారు.
Read Also:Andhrapradesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. వైద్యశాఖలో కొత్తగా 2,118 పోస్టులు మంజూరు
తాజావార్తలు
-
Amit Shah : కాంగ్రెస్‌ను గద్దె దించడమే లక్ష్యం.. చొరబాటుదారులను తరిమికొడతాం
-
Arnab Cyclone Effect: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. ఏపీకి రూ.4,600 కోట్ల నష్టం.!
-
Cyclone Murasu: ముంచుకొస్తున్న మురసు.. కీలక హెచ్చరికలు జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ..
-
Imran Khan: అమెరికా పౌరుడిగా ఉంటూ భారత్‌లో నిరసనలా?.. నటుడిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు!
-
Murder Mystery: వీడిన నటి రాధిక పని మనిషి కొడుకు మర్డర్ మిస్టరీ
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!