NTV Telugu Site icon

Rohit Sharma: ఆ క్రికెట్ దిగ్గజాలను అధిగమించిన ‘హిట్ మ్యాన్’.. వన్డే ప్రపంచకప్‌లో అరుదైన రికార్డ్

Rohit

Rohit

Rohit Sharma: వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సగటు పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌లో కనీసం 1,000 పరుగులు చేసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ అత్యధిక బ్యాటింగ్ సగటును కలిగి ఉన్నాడు. సచిన్ టెండూల్కర్, వివ్ రిచర్డ్స్ వంటి దిగ్గజాలు కూడా రోహిత్ శర్మ తర్వాత జాబితాలో ఉన్నారు. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ 65.2 సగటుతో పరుగులు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ 63.5 సగటుతో పరుగులు చేసిన జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ మాజీ బ్యాట్స్‌మెన్ వివ్ రిచర్డ్స్ మూడో స్థానంలో, ప్రస్తుత ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ నాలుగో స్థానంలో, సచిన్ టెండూల్కర్ ఐదో స్థానంలో ఉన్నారు. వన్డే ప్రపంచకప్‌లో వివ్ రిచర్డ్స్ 63.3 సగటుతో, డేవిడ్ వార్నర్ 60.8 సగటుతో, సచిన్ టెండూల్కర్ 57 సగటుతో పరుగులు సాధించారు.

Read Also: Jasprit Bumrah: ఆఫ్ఘాన్పై 4 వికెట్లు పడగొట్టినా సంతోషంగా లేను.. కారణమదే..!

2023 ప్రపంచకప్‌లో భాగంగా.. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 131 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాకుండా వన్డేల్లో 1,000 పరుగుల సంఖ్యను చేరుకోవడంలో విజయం సాధించాడు. దీంతో ప్రపంచకప్‌లో అత్యధికంగా 7 సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు. అంతేకాకుండా ఆఫ్ఘాన్ తో జరిగిన మ్యాచ్ లో.. రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును నెలకొల్పాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 253 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో అతను 49 సగటుతో 10243 పరుగులు చేశాడు. అందులో 31 సెంచరీలు, 52 అర్ధ సెంచరీలు సాధించాడు.

Read Also: Varun Tej – Lavanya: లావణ్య వరుణ్ పెళ్లి అక్కడే.. రిసార్ట్ లొకేషన్ తెలిసిపోయింది!