Site icon NTV Telugu

Rohit Sharma: రోహిత్ శర్మ ప్రత్యేక రికార్డు.. ఓపెనర్గా ట్రిపుల్ సెంచరీ

Rohit

Rohit

Rohit Sharma: ఆసియా కప్ 2023లో భాగంగా కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ సూపర్- 4 మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట ఓ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా భారత్ తరఫున రోహిత్ 300 మ్యాచ్‌లు పూర్తి చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్‌కు సంబంధించిన ప్రత్యేక జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు భారత్ తరఫున ఓపెనర్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.

Read Also: RRR : ఆర్ఆర్ఆర్ సినిమా పై ప్రశంసలు కురిపించిన బ్రెజిల్ అధ్యక్షుడు…

భారత్ తరఫున ఓపెనర్‌గా రోహిత్ తన 300వ అంతర్జాతీయ మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడుతున్నాడు. ఓపెనర్ గా బ్యాటింగ్‌లో రోహిత్ 9870 పరుగులు చేశాడు. సెకండ్ డౌన్ లో బ్యాటింగ్‌ చేస్తూ 3496 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా రోహిత్ ఇప్పటివరకు 39 సెంచరీలు సాధించాడు. టీమిండియా తరఫున ఓపెనర్‌గా దిగ్గజ క్రికెటర్ సచిన్ అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అతను 346 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. వీరేంద్ర సెహ్వాగ్ రెండో స్థానంలో ఉన్నాడు. సెహ్వాగ్ 321 మ్యాచ్‌లు ఆడాడు. రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. శిఖర్ ధావన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ధావన్ 268 మ్యాచ్‌లు ఆడాడు.

Read Also: Virat Kohli: ఈ మ్యాచ్లో కోహ్లీ ప్రపంచ రికార్డు సాధిస్తాడా..!

ఆసియా కప్ 2023లో భారత్ తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడింది. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైంది. ఆ తర్వాత భారత్‌ నేపాల్‌తో ఆడింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు టీమిండియా మళ్లీ పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడుతోంది. ఆ తర్వాత సెప్టెంబర్ 12న భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 15న భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లు కూడా కొలంబోలోనే జరగనున్నాయి.

Exit mobile version