NTV Telugu Site icon

Rohit Sharma: సెహ్వాగ్ రికార్డుకు దగ్గర్లో ‘హిట్ మ్యాన్’.. టెస్ట్ క్రికెట్‌లోనే

Rohit Sharma Century

Rohit Sharma Century

సెప్టెంబర్ 19 నుంచి భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నైలో జరగనుంది. ఈ క్రమంలో.. రోహిత్ శర్మ, కోహ్లీ సహా భారత జట్టు శుక్రవారం ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. అనంతరం.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు కొత్త బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ టీమిండియా క్రికెటర్లతో చర్చలు జరిపారు.

Read Also: Nandyal: కూలిస్తే దూకి చస్తా.. ఇంటిపైకి ఎక్కి అధికారులను బెదిరించిన యజమాని

ఇదిలా ఉంటే.. అత్యధిక సిక్సర్లు బాదిన వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ బద్దలు కొట్టే అవకాశం ఉంది. కేవలం ఐదు సిక్సులు కొడితే.. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టీమిండియా ఆటగాడిగా అవతరిస్తాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 104 మ్యాచ్‌ల్లో 91 సిక్సర్లు కొట్టాడు. 59 మ్యాచ్‌ల్లో రోహిత్ 87 సిక్సర్లు బాదాడు. 90 మ్యాచ్‌ల్లో 78 సిక్సర్లు బాదిన ఎంఎస్ ధోని ఈ జాబితాలో మూడో భారత ఆటగాడిగా ఉన్నాడు. రాబోయే టెస్టు సిరీస్‌లో రోహిత్ 13 సిక్సర్లు బాదితే 100 టెస్టు సిక్సర్లు బాదిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కుతాడు.

Read Also: Sunita Williams: అంతరిక్షం నుంచే సునీతా విలియమ్స్ ఓటు.. ఇది ఎలా సాధ్యం..?

భారత్ బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు, న్యూజిలాండ్‌తో మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడనుంది. ఈ 10 టెస్టు మ్యాచ్‌ల్లో ఐదింటిని భారత జట్టు గెలిస్తే, వరుసగా మూడోసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ సిరీస్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భాగం. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ రోహిత్.. ఇప్పటివరకు 620 సిక్సర్లు కొట్టాడు. ప్రపంచంలోనే 600+ సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ.. వన్డేల్లో 331 సిక్సర్లు, టీ20లో 205 సిక్సర్లు కొట్టాడు.