NTV Telugu Site icon

Rohit Sharma: కొడుకు పుట్టిన తర్వాత మొదటిసారి స్పందించిన హిట్ మ్యాన్..

Rohit

Rohit

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండోసారి తండ్రి అయ్యాడు. భార్య రితికా సజ్దే నవంబర్ 15న (శుక్రవారం) మగబిడ్డకు జన్మనిచ్చింది. రోహిత్ శర్మకు కొడుకు పుట్టడంతో అతని కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ కుటుంబ సభ్యులు నలుగురయ్యారు. రోహిత్, రితిక దంపతులకు 2018లో సమైరా అనే కూతురు జన్మించింది. కాగా.. కొడుకు పుట్టడంపై రోహిత్ శర్మతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. రోహిత్ శర్మ మొదటి సారి స్పందించాడు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసి తన భావాలను వ్యక్తం చేశాడు. అయితే.. కొడుకు పుట్టడంతో భారత జట్టుతో కలిసి రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్లలేదు. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది.

Read Also: Minister Savitha: త్వరలో 16 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం..

రోహిత్ శర్మ శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో సంతోషకరమైన కుటుంబం సింబాలిక్ ఫొటోను షేర్ చేశాడు. అంతేకాకుండా ఫోటోపై “మేము నలుగురితో కూడిన కుటుంబం” అని రాశాడు. ఓ సోఫాపై కూర్చుని వారు నవ్వుతున్నట్లు ఫొటోలో చూడవచ్చు. కాగా.. రోహిత్ శర్మ పోస్ట్‌పై అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. నెటిజన్లు తమదైన శైలిలో విషెస్ తెలుపుతున్నారు. రోహిత్ శర్మ, రితిక 2015 డిసెంబర్ 13న వివాహం చేసుకున్నారు.

Read Also: Banana: చలికాలంలో అరటిపండు తింటే ఆరోగ్యానికి మంచిదేనా..?

Show comments