Site icon NTV Telugu

Rohit Sharma: రంజీ ట్రోఫీ ఆడనున్న రోహిత్? ప్రాక్టీస్ షురూ..

Rohit

Rohit

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల కోల్పోయిన తన ఫామ్‌ను తిరిగి పొందేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకు కోసం తాజాగా రోహిత్ రంజీ జట్టుతో ప్రాక్టీస్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి రోహిత్ ముంబయి రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. గత కొంతకాలంగా ఫామ్ లో లేకపోవడంతో అతడు జట్టులో చోటు కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు పూర్తిగా విఫలమైంది. ఇకపోతే మరోవైపు, రోహిత్ శర్మ ఈ నెల 23 నుండి ప్రారంభమయ్యే రంజీ మ్యాచుల్లో ముంబయి జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు.

Also Read: Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా.. రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట!

ఇందుకోసం ఫామ్‌లోలి తిరిగి రావడం కోసం రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొనడానికి నిర్ణయించుకున్నాడు. రంజీ ట్రోఫీ కోసం ముంబయి జట్టు వాంఖడే స్టేడియం, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేడియాల్లో వారం రోజుల పాటు ప్రాక్టీస్ చేయనుంది. ఈ ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ శర్మతో పాటు అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్ లాంటి టీమిండియా స్టార్ ఆటగాళ్లు కూడా ఆడనున్నారు. ఇక ముంబయి జట్టు తొలి మ్యాచ్‌లో జమ్ము కశ్మీర్‌తో తలపడనుంది. అయితే రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడుతాడా లేదా అనేది ఇంకా ప్రశ్నగానే ఉంది. ఈ విషయంపై అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. రంజీ ట్రోఫీ ద్వారా రోహిత్ తన ఫామ్‌ను తిరిగి పొందేందుకు బాగా ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది.

Exit mobile version