Site icon NTV Telugu

Rohit Sharma: దూసుకుపోతున్న హిట్ మ్యాన్.. వరల్డ్ కప్లో పరుగుల జోరు

Rohit

Rohit

ప్రపంచకప్‌ 2023లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దూసుకుపోతున్నాడు. ఈ ట్రోఫీలో తన బ్యాట్ తో పరుగుల వరద పారిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో విఫలమైనప్పటికీ.. రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ కొట్టాడు.. ఆ తర్వాత పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇవాళ(గురువారం) బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. దీంతో ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ 250 పరుగుల ఫిగర్‌ను టచ్ చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ మినహా మరే ఇతర బ్యాట్స్‌మెన్ ఈ స్థానాన్ని సాధించలేదు.

Read Also: Minister Puvvada Ajay: బరాబర్ మా పార్టీ సెక్యులర్ పార్టీనే.. అందుకే ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నాం..

ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో రోహిత్ శర్మ తర్వాత.. న్యూజిలాండ్ ఓపెనర్ డ్వేన్ కాన్వే రెండో స్థానంలో ఉన్నాడు. డ్వేన్ కాన్వే 249 పరుగులు చేశాడు. మూడో స్థానంలో పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ నిలిచాడు. మొహమ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్‌లో ఇప్పటి వరకు 248 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ 229 పరుగులు ఉన్నాయి. ఐదో స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన రచిన్ రవీంద్ర ఐదో స్థానంలో నిలిచారు. ఈ యువ బ్యాట్స్‌మెన్ 215 పరుగులు చేశాడు.

Read Also: AP CM Jagan: కొడాలి నాని మేనకోడలి వివాహా వేడుకకు హాజరైన సీఎం జగన్‌

ప్రపంచకప్లో భారత్కు తొలి మ్యాచ్లోనే రోహిత్ శర్మ బ్యాడ్ స్టార్ట్ అందిచాడు. ఆ తర్వాత ఆఫ్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ తో అద్భుతంగా పునరాగమనం చేశాడు. ఆఫ్ఘనిస్థాన్‌పై రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 84 బంతుల్లో 131 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌పై రోహిత్ శర్మ కేవలం 63 బంతుల్లో 86 పరుగులు చేశాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‌పై రోహిత్ శర్మ 40 బంతుల్లో 48 పరుగులు చేశాడు. దీంతో 2023 ప్రపంచకప్‌లో 250 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

Exit mobile version