NTV Telugu Site icon

IND vs AUS: రెండో టెస్టుకు రోహిత్ శర్మ ఓపెనర్ కాదు.. ఏ స్థానంలో ఆడనున్నాడంటే..?

Rohit Sharma Test

Rohit Sharma Test

అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఈ నెల 6న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తున్నాడు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో అతను ఆడలేదు. తనకు కొడుకు పుట్టడం వల్ల ఇండియాలోనే ఉండిపోయాడు. అయితే.. సెకండ్ టెస్టుకు ఆడబోతుండటంతో.. రోహిత్ శర్మ ఎప్పటిలాగే ఓపెనర్‌గా దిగుతాడు అనుకున్నారు. అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఏదో జరిగింది.. దాని కారణంగా రోహిత్ ఓపెన్ చేయడని తెలుస్తోంది.

Read Also: Rohith Sharma Son Name: ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేస్తూ కొడుకు పేరును చెప్పేసిన రితికా సజ్దే..

ప్రస్తుతం కాన్‌బెర్రాలో ఉన్న టీమిండియా రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో మొదటి రోజు వర్షం కారణంగా జరగలేదు. ఈ మ్యాచ్‌లో నేడు రెండో రోజు టీమిండియా మొదట బౌలింగ్ చేస్తోంది. టీమ్ లిస్ట్ రాగానే రెండో టెస్టు మ్యాచ్‌లో రోహిత్ ఓపెనింగ్ చేయకూడదనే సూచనలు వచ్చాయి. జట్టు జాబితాలో రోహిత్ పేరు ఐదో స్థానంలో ఉంది. సాధారణంగా ఈ జాబితా బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం తయారు చేస్తారు. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ పేరు ఐదో స్థానంలో ఉంది. బహుశా రోహిత్ అడిలైడ్‌లో ఓపెనింగ్ బ్యాటింగ్ చేయకపోవచ్చు.

Read Also: Nara Lokesh: దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు: మంత్రి లోకేశ్‌

పెర్త్‌ టెస్టులో భారత ఓపెనర్లు ఇద్దరూ బాగా రాణించడం కూడా దీనికి కారణం కావచ్చు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన యశస్వి జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో కష్ట సమయాల్లో వికెట్‌ నష్టపోకుండా ఆచితూచి ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ ధీటుగా బ్యాటింగ్‌ చేసి 77 పరుగులు చేశాడు. మరోవైపు.. రెండో టెస్టుకు శుభమన్ గిల్ అందుబాటులో ఉండనున్నాడు. ఈ క్రమంలో.. అతను 3వ నంబర్‌లో బ్యాటింగ్ చేయడం ఖాయం. తొలి మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. కాగా.. గిల్ రాకతో పడిక్కల్‌కు జట్టులో స్థానం లభించకపోవచ్చు. కోహ్లీ నాలుగో స్థానంలో, ఐదవ స్థానంలో రోహిత్ శర్మ ఆడనున్నాడు.