అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఈ నెల 6న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తున్నాడు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో అతను ఆడలేదు. తనకు కొడుకు పుట్టడం వల్ల ఇండియాలోనే ఉండిపోయాడు. అయితే.. సెకండ్ టెస్టుకు ఆడబోతుండటంతో.. రోహిత్ శర్మ ఎప్పటిలాగే ఓపెనర్‌గా దిగుతాడు అనుకున్నారు.