ఆదివారం కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయిని చేరుకున్నాడు. అతని అద్భుత ప్రదర్శనతో కొత్త రికార్డులు సృష్టించాడు. చాలా కాలంగా ఫామ్‌లో లేని హిట్‌మ్యాన్.. 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 119 పరుగులు చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. రోహిత్ శర్మ 36వ సెంచరీతో ఒక ప్రత్యేక మైలురాయిని చేరుకున్నాడు. 30 ఏళ్ల తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. అతని దూకుడు ఇన్నింగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఒక సంవత్సరంలో కనీసం ఒక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకోవడం ఇది అతని కెరీర్‌లో వరుసగా 13వ సంవత్సరం. ఒక సంవత్సరంలో ఒక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకోవడంలో గొప్ప విషయం ఏమిటి..? అని అనుకుంటున్నారా.. గత 13 సంవత్సరాలలో విరాట్ కోహ్లీ , స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్, జోస్ బట్లర్, బాబర్ అజామ్ వంటి గొప్ప బ్యాట్స్‌మెన్లు ఈ ఫీట్ సాధించలేకపోయారు.
30 ఏళ్ల తర్వాత భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. 30 ఏళ్ల తర్వాత 35 సెంచరీలు చేసిన గొప్ప బ్యాట్స్‌మన్ సచిన్ రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. సెంచరీ చేసిన అతి పెద్ద వయసు భారత కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. మరోవైపు అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా ఆటగాళ్లలో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 49 శతకాలు బాదాడు. ఈ జాబితాలో సచిన్ టెండ్యూలర్ (100 సెంచరీలు), విరాట్ కోహ్లీ (81 సెంచరీలు) మొదటి, రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-10లోకి హిట్‌మ్యాన్ దూసుకొచ్చాడు. ప్రస్తుతం రోహిత్ 10,964 పరుగులతో నాలుగో భారత బ్యాటర్‌గానూ ఉన్నాడు. సచిన్ (18,426 పరుగులు), కోహ్లీ (13,906), గంగూలీ (11,363) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు.
Read Also: Punjab: పంజాబ్ పాటియాలాలో పట్టుబడిన రాకెట్ మందుగుండు సామాగ్రి..