Site icon NTV Telugu

Rohit Sharma: తాను సాధించలేకపోయినా.. మహిళల గెలుపుతో కన్నీరు పెట్టుకున్న హిట్ మ్యాన్..!

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: భారత మహిళల క్రికెట్ జట్టు తమ తొలి వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకోవడంతో.. భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. స్వదేశంలో ప్రపంచకప్‌ను కోల్పోవడం ఎంత బాధ కలిగిస్తుందో బాగా తెలిసిన రోహిత్‌కు ఈ విజయం ప్రత్యేకంగా నిలిచింది. ఆదివారం (నవంబర్ 2) నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రక విజయాన్ని స్టేడియంలో వీక్షించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కళ్లలో ఆనంద భాష్పాలు కనిపించాయి.

HMDA Land Auction: గ్రేటర్ హైదరాబాద్‌లో మరోసారి భూముల వేలం.. కోకాపేట, కూకట్‌పల్లిలో అమ్మకానికి 47 ఎకరాలు..!

వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ ఫైనల్ పోరులో, టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ 298 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది మహిళల ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరు. ఓపెనర్లు స్మృతి మంధాన (45), షఫాలీ వర్మ (87) 104 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. షఫాలీ 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ త్వరగా ఔటైనా, దీప్తి శర్మ (58) ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. చివర్లో రిచా ఘోష్ (24) వేగవంతమైన ఇన్నింగ్స్‌తో భారత్‌ను పటిష్ట స్థితికి చేర్చింది.

299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ అద్భుత సెంచరీ (101 పరుగులు)తో భారత్‌కు కొంత టెన్షన్ పెట్టింది. ఆమెతో పాటు సునే లూస్ జోడీని, కీలక బౌలింగ్‌తో షఫాలీ వర్మ విడదీసి గేమ్ ఛేంజర్‌గా నిరూపించుకుంది. దీప్తి శర్మ తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అద్భుతంగా రాణించింది. ఆమె బ్యాటింగ్‌లో 58 పరుగులతో పాటు బౌలింగ్‌లో కేవలం 39 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ వేసిన బంతికి నదీన్ డి క్లెర్క్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన క్యాచ్‌తో ఔట్ చేసి విజయాన్ని ఖాయం చేసింది. ఈ చివరి వికెట్‌ పడగానే యావత్ భారత జట్టు సంబరాల్లో మునిగిపోయింది.

Team India: వరల్డ్ కప్ సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు.. జగన్, పవన్ అభినందనలు

టీమ్ ఇండియా ప్రపంచ ఛాంపియన్‌గా మారిన వెంటనే కెమెరాలు వీఐపీ బాక్స్ వైపు మళ్లగా, అక్కడ తన భార్యతో కలిసి మ్యాచ్ చూస్తున్న రోహిత్ శర్మ కళ్లలో ఆనంద భాష్పాలు కనిపించాయి. 2023 పురుషుల ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం దేశాన్ని కదిలించగా, ఇప్పుడు మహిళల విజయం చూసి ఆయన మళ్లీ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విజయంపై మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ ఐసీసీ ఛానల్‌తో మాట్లాడుతూ.. “గత 15 ఏళ్లుగా మేము ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాం. మహిళా జట్టు ఈసారి ఆ సరిహద్దు దాటుతుందని ఆశిస్తున్నా” అని ఆశించారు. రోహిత్ అన్నట్టుగానే ఆ మాటలు నిజమయ్యాయి. ఈ చారిత్రాత్మక విజయాన్ని చూసేందుకు స్టేడియంలో సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సునీల్ గవాస్కర్, జై షా, నీతా అంబానీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని విరాట్ కోహ్లీ కూడా సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. వీరితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా సోషల్ మీడియా ద్వారా టీమిండియాకు అభినందనలు తెలిపారు.

Exit mobile version