Rohit Sharma: భారత మహిళల క్రికెట్ జట్టు తమ తొలి వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకోవడంతో.. భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. స్వదేశంలో ప్రపంచకప్‌ను కోల్పోవడం ఎంత బాధ కలిగిస్తుందో బాగా తెలిసిన రోహిత్‌కు ఈ విజయం ప్రత్యేకంగా నిలిచింది. ఆదివారం (నవంబర్ 2) నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో…