Rohit Sharma: “ఓరి దేవుడా.. రోహిత్, గుర్తుపట్టలేకపోయాను”.. హిట్‌మ్యాన్‌ను చూసి అందరూ షాక్

Rohit Sharma Fitness

Rohit Sharma Fitness

Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కు రెండే రోజులు మిగిలి ఉంది. ఈ సీజన్‌లో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్ మార్పుతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆటగాళ్లను కలిసేందుకు ముంబై ఇండియన్స్ (MI) శిబిరాన్ని సందర్శించిన నీతా అంబానీ సైతం రోహిత్‌ను చూసి ఆశ్చర్యపోయారు. ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ మాట్లాడుతూ.. “ఓరి దేవుడా, రోహిత్, నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను. నువ్వు ఒక చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నావు.” అని అన్నారు. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేశారు. ఇందులో రోహిత్ శర్మ తన బరువును తగ్గి, ఫిట్‌నెస్‌పై ఎంతంగా దృష్టిపెట్టాడో కనిపిస్తోంది. రోహిత్ మునుపెన్నడూ లేనంత ఫిట్‌గా, సన్నగా, చురుకుగా కనిపిస్తున్నాడు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత.. 2027 వన్డే ప్రపంచ కప్ గెలవాలనే తపనతో ఉన్నాడు హిట్‌ మ్యాన్. ఈ ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి రోహిత్ తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. నిజానికి, 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో హృదయవిదారక ఓటమి తర్వాత, రోహిత్ శర్మ తనను తాను పూర్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడట.

READ MORE: Vivek Sinha: “పాకిస్థానీయులు ప్రేమిస్తున్నారు.. భారతీయులు చంపేస్తామంటున్నారు”.. ధురంధర్ నటుడు షాకింగ్ కామెంట్స్..

ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా తన ఫిట్‌నెస్, ఆట రెండింటిపైనా తీవ్రంగా కృషి చేశాడు. ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సంవత్సరం ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో సహా 202 పరుగులు సాధించాడు. తన ఈ అద్భుత ప్రదర్శనకు గాను, రోహిత్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును గెలుచుకున్నాడు. అయితే, ఐపీఎల్‌లో గత కొన్ని సంవత్సరాలుగా రోహిత్ శర్మకు కలిసి రావడం లేదు. లీగ్‌లో అత్యధిక పరుగులు జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నప్పటికీ.. ఇటీవలి సీజన్‌లలో తన మార్కీ ప్లేయర్ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు. రోహిత్ శర్మ చివరిసారిగా 2016 ఐపీఎల్ సీజన్‌లో 450కి పైగా పరుగులు సాధించాడు. అత్యుత్తమ ఐపీఎల్ సీజన్ 2013, ఆ సీజన్‌లో ఏకంగా 538 పరుగులు సాధించాడు. 2016 తర్వాత నుంచి ఫర్ఫామెన్స్ నెమ్మదిగా తగ్గుతోంది. ఈ ఏడాది మాత్రం అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.

READ MORE: Gold and Silver Price Today: పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్‌.. మరోసారి తగ్గిన బంగారం ధర..