Site icon NTV Telugu

Rohit Sharma: ప్రతి భారతీయుడు బాధ్యతాయుతంగా ఉండండి.. నకిలీ వార్తలను వ్యాప్తి చేయకండి..!

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: భారత్‌–పాకిస్థాన్‌ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాలలో ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత్‌ “ఆపరేషన్‌ సిందూర్‌” పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా పాకిస్థాన్‌ కూడా జమ్మూ కశ్మీర్‌ తో పాటు ఇతర ప్రాంతాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది.

Also Read: Pakistan: కొత్త బిచ్చగాడు పొద్దెరగడు.. పైసల కోసం పాక్‌ ప్రయత్నాలు

కానీ, భారత భద్రతా దళాలు ఆ దాడులను సమర్థంగా తిప్పికొట్టాయి. ఆ తర్వాత భారత్‌ మళ్లీ పాక్‌పై సమాధానాత్మక దాడులు చేసింది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పలు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అయితే, వీటిలో చాలావరకు వీడియోలు నకిలీవని AI సాంకేతికత ద్వారా తయారైనవని ఫ్యాక్ట్‌ చెకర్లు వెల్లడిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారత వన్డే క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

Also Read: Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. తెలుగు జవాన్‌ వీరమరణం..

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ భారత సాయుధ దళాలపై తన గౌరవాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భారత సైన్యం, భారత వైమానిక దళం, భారత నౌకాదళానికి తన మద్దతును తెలియజేశారు. ప్రతి క్షణం, ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు మన భారత సైన్యం, వైమానిక దళం, నౌకాదళం పట్ల నాకు గర్వంగా ఉంటుంది. మన యోధులు దేశ గౌరవాన్ని కాపాడేందుకు నిలబడి ఉన్నారని రోహిత్ శర్మ తెలిపారు. అంతేగాక, భారత ప్రజలందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలనీ, ఫేక్ న్యూస్‌ను నమ్మకూడదనీ, దానిని పంచుకోకూడదనీ తెలిపారు. అలాగే ప్రతీ భారతీయుడు బాధ్యతగా ఉండాలి. ఏదైనా అప్రమత్తత లేకుండా నమ్మే ఫేక్ న్యూస్ వల్ల అనవసర భయం, అపోహలు వ్యాపిస్తాయని తెలిపారు. అందరూ సురక్షితంగా ఉండండి అంటూ రోహిత్ శర్మ తన ఖాతాలో తెలిపాడు. ఇక తాజాగా రోహిత్ శర్మ టెస్టుల నుండి రిటైర్ అవుతున్నట్లు తెలిపిన విషయం తెలిపిందే.

Exit mobile version