Site icon NTV Telugu

IPL 2024: ఎయిర్‌పోర్టులో అభిమానులపై రోహిత్ శర్మ ఆగ్రహం.. వేలు చూపిస్తూ మరీ..!

Rohit Sharma

Rohit Sharma

చాలా ప్రశాంతమైన క్రికెటర్లలో రోహిత్ శర్మ ఒకరు. అతను ఎప్పుడు కూల్గా, ప్రశాంతంగా ఉంటారు. ఫీల్డ్లో కూడా చాలా కూల్ గానే కనిపిస్తాడు. క్రికెట్ పరంగా కాకున్నా.. నిజ జీవితంలో కూడా చాలా కూల్గా ఉంటాడు. అంతేకాకుండా.. తాను తోటి క్రికెటర్లతో కానీ, ఫ్యామిలీతో కానీ స్పెండ్ చేసినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో మనం వీడియోల్లో చూస్తుంటాం. కాగా.. రోహిత్ శర్మకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అభిమానులకు నోటిపై వేలు పెట్టి చూపిస్తూ ప్రశాంతంగా ఉండమని అంటున్నాడు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.

IPL 2024: సన్రైజర్స్ అభిమానులకు భారీ షాక్.. ఈ సీజన్ మొత్తం స్టార్ ప్లేయర్ దూరం..!

రోహిత్ శర్మ ఎక్కువగా తన కుటుంబంతోనే గడపుతుంటాడు. హిట్‌మ్యాన్ జీవితంలో అతని భార్య, కుమార్తె సమైరాలో ఉంది. రోహిత్ తన కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపుతూ చాలాసార్లు కనిపించాడు. అయితే.. ఈ వీడియలో రోహిత్ తన భార్య, కుమార్తెతో కలిసి విమానాశ్రయం నుండి బయటకు వస్తుండగా.. రోహిత్ శర్మ కుమార్తె నిద్రపోతోంది.

Hi Nanna: ‘నాన్న’కి హాయ్ చెప్పిన బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌ అవార్డ్

ఆ సమయంలో అభిమానులు తమ అభిమాన క్రికెటర్ రోహిత్‌ను చూసి చాలా అరుస్తున్నారు. అయితే కూతురు నిద్ర పోతుండటంతో అభిమానులు అల్లరి చేయడం నచ్చలేదు. దీంతో.. రోహిత్ శర్మ తన నోటిపై వేలు పెట్టి, అభిమానులను ప్రశాంతంగా ఉండమని సూచిస్తూ తన కారు వైపు వెళ్లాడు. కాగా.. రోహిత్ శర్మ తన కూతురిపై చూపుతున్న ఈ ప్రేమను చూసిన అభిమానులు.. సోషల్ మీడియాలో రోహిత్‌ను చాలా ప్రశంసిస్తున్నారు.

Exit mobile version