Rohit Sharma Daughter: మా డాడీ ఇంకో నెలలో నవ్వుతాడు.. సమైరా వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Daughter Samaira Says My Dad Laugh in One Month: నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ ఓటమితో సొంత గడ్డపై రెండోసారి కప్పు అనుకోవాలనుకున్న టీమిండియా ఆశలు అడియాసలయ్యాయి. భారత జట్టు అనూహ్య ఓటమితో భారత అభిమానులే కాకుండా.. ఆటగాళ్లు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోనే ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. రోహిత్ కన్నీళ్లను దిగమింగిన దృశ్యాలు ప్రతి భారతీయుడిని కదిలించాయి.
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఓడిన రోహిత్ సేనకు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు బాసటగా నిలిచారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా హిట్‌మ్యాన్ కూతురు సమైరాకు సంబందించిన ఓ పాత వీడియో ఒకటి ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. సమైరా తన తల్లి రితికాతో కలిసి వెళుతుండగా.. రిపోర్టర్స్ రోహిత్ గురించి అడుగుతారు. డాడీ ఎక్కడ ఉన్నాడు అని అడగ్గా.. గదిలో ఉన్నాడని సమాధానం ఇస్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అడిగితే.. పాజిటివ్‌గానే ఉన్నాడు, మరొక నెలలో మళ్లీ నవ్వుతాడు అని సమైరా చెప్పింది.
Also Read
- BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
- Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
Also Read: Navdeep Saini Marriage: ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా క్రికెటర్!
12 ఏళ్ల తర్వాత స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ చెలరేగాడు. 597 పరుగులతో టోర్నీ రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతేకాదు ఈ ప్రపంచకప్‌లో అత్యధిక రన్స్ బాదిన కెప్టెన్‌గా కూడా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. లీగ్ దశ నుంచి హిట్‌మ్యాన్ ప్రత్యర్థి బౌలర్లపై ఇన్నింగ్స్ ఆరంభంలోనే విరుచుకుపడ్డాడు. దాంతో మిగతా బ్యాటర్స్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేందుకు అవకాశం లభించింది. ఫైనల్లో కూడా ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రోహిత్.. 47 పరుగులు చేశాడు. రోహిత్ పెవిలియన్ చేరాక.. భారత్ ఇన్నింగ్స్ లో వేగం తగ్గింది. చివరకు 240 పరుగులు మాత్రమే చేసింది.
The way she answered 🥹❤
Samaira said : He is in a room, he is almost positive & within one month he will laugh again.@ImRo45 pic.twitter.com/yt3iSQa6MP
— 46thcenturywhenRohit (@RohitCharan_45) November 23, 2023
తాజావార్తలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!