NTV Telugu Site icon

Rohit Sharma: రోహిత్ శర్మ తుఫాను ఇన్నింగ్స్.. హిట్‌మ్యాన్‌ పేరిట మరో రికార్డ్

Rohit Sharma Retired Hurt

Rohit Sharma Retired Hurt

రోహిత్ శర్మ చాలా కాలంగా విఫలమవుతున్నాడు. కానీ ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ తుఫాను ఇన్నింగ్స్ ఆడి 76 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 16 నెలల తర్వాత రోహిత్ వన్డేల్లో సెంచరీ సాధించాడు. 7 సిక్స్ లు, 9 ఫోర్లతో చెలరేగాడు. వన్డేల్లో రోహిత్ శర్మకి ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. 2023 లో ఆఫ్ఘనిస్తాన్ పై 63 బంతుల్లో సెంచరీ చేశాడు. ఢిల్లీలో జరిగిన వన్డేలో రోహిత్ 131 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు హిట్‌మ్యాన్ ఫామ్‌లోకి రావడం టీం ఇండియాకు ఇది పెద్ద శుభవార్త. అంతే కాకుండా వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. వన్డేల్లో 336 సిక్స్ లు కొట్టి చరిత్ర సృష్టించాడు.

READ MORE: Yadadri: పాఠశాల నుండి ఇంటికి ఆలస్యంగా వచ్చాడని కొడుకుని కొట్టి చంపిన తండ్రి..

క్రిస్ గేల్‌(331)ను దాటి రెండో స్థానానికి చేరుకున్నాడు. 351 సిక్స్ లతో మొదటి స్థానంలో షాహిద్ అఫ్రిది ఉన్నాడు. ఇదిలా ఉండగా.. భారత్-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న 3 మ్యాచ్‌ల ఓడీఐ సిరీస్‌లో రెండవ మ్యాచ్ కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ జట్టు 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 190 పరుగులకు పైగా చేసింది. రోహిత్ 76 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.

READ MORE: Anakapalle: తీవ్ర విషాదం.. సముద్రంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల గల్లంతు..