Rohit Sharma: రిటైర్‌మెంట్‌పై మౌనం వీడిన రోహిత్
- రిటైర్‌మెంట్‌పై మౌనం వీడిన రోహిత్
- మీడియా సమావేశంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడి.
- జట్టు ప్రయోజనాలే ముఖ్యమన్న రోహిత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma On Retirement: సిడ్నీ టెస్ట్‌కు దూరంగా కూర్చోవడం అంటే తాను రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు కాదని టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. దీనితో పాటు, తన పేలవమైన ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని సిడ్నీ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. తన నిర్ణయాన్ని మ్యాచ్‌కు ఒక రోజు ముందు కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు చెప్పానని తెలిపాడు. దాంతో సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
Also Read: IND vs AUS: విజృంభించిన టీమిండియా బౌలర్లు.. ప్రతిఘటిస్తున్న ఆసీస్ బ్యాటర్స్
Also Read
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
- Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
ఇక సిడ్నీ టెస్ట్ రెండో రోజు లంచ్ విరామంలో రోహిత్ మీడియా సమావేశంలో పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు. సిడ్నీ టెస్టు నుంచి తాను విశ్రాంతి తీసుకోవడమే కానీ, క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం లేదని ఆయన స్పష్టం చేశాడు. జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నానని రోహిత్ వెల్లడించాడు. పెర్త్ టెస్టులో కేఎల్ రాహుల్ – యశస్వి జైస్వాల్ జోడీ అద్భుతంగా ఆడి డబుల్ సెంచరీ భాగస్వామ్యం సాధించి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిందని రోహిత్ పేర్కొన్నాడు. ఆ జోడీని మార్చకూడదనే ఉద్దేశంతో, అలాగే కేఎల్ రాహుల్ ఫామ్ కూడా మెరుగ్గా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. ఫామ్‌లో లేని ప్లేయర్లతో కీలకమైన మ్యాచ్‌లు ఆడించడం జట్టు ప్రయోజనాలకు అనుకూలం కాదని భావించామని, ఇది చాలా సున్నితమైన నిర్ణయం అంటూ తెలిపాడు. కానీ జట్టు ప్రయోజనాలే నాకు ముఖ్యమైనవని రోహిత్ పేర్కొన్నాడు.
Also Read: Donald Trump: హష్ మనీ కేసులో జనవరి 10న కోర్టుకు ట్రంప్.. శిక్ష విధిస్తామని తెలిపిన కోర్టు
మీడియాలో వస్తున్న డ్రెస్సింగ్ రూమ్‌లో సమస్యల వార్తలను రోహిత్ ఖండించాడు. మనస్పర్థల గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, అలాంటి ప్రచారాన్ని నియంత్రించడం మన చేతుల్లో లేదని తెలిపాడు. జట్టులో అందరూ బాగా కలిసిమెలసి ఉంటున్నారని రోహిత్ చెప్పుకొచ్చాడు. అలాగే తన ఫామ్ హురించి మాట్లాడుతూ.. ఇప్పుడు నేను ఫామ్‌లో లేకపోవచ్చు, కానీ.. రాబోయే ఐదు నెలల్లో కూడా పరుగులు చేయలేనని ఎవరూ చెప్పలేరు. ఫామ్ కోసం నిరంతరం శ్రమిస్తా. ఎవరో ల్యాప్‌ట్యాప్, పేపర్, పెన్ పట్టుకొని నా రిటైర్మెంట్ గురించి నిర్ణయం తీసుకోలేరని కాస్త మీడియాపై ఘాటుగానే స్పందిచాడు. నేను ఇద్దరు పిల్లల తండ్రిని, నాకు ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలుసునని రోహిత్ పేర్కొన్నాడు. అలాగే మైదానంలో కొన్‌స్టాస్, బుమ్రాల మధ్య జరిగిన వాగ్వాదంపై మాట్లాడుతూ.. మా కుర్రాళ్లు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటారు. ఎవరైనా రెచ్చగొడితే, వారు స్లెడ్జింగ్‌కు తగిన విధంగా స్పందిస్తారని రోహిత్ సున్నితంగా సమాధానమిచ్చాడు. ఈ స్పష్టతతో రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ పుకార్లకు తెరదించడంతో పాటు జట్టు సమైక్యత విషయంలో కూడా స్పష్టం చేసాడు.
తాజావార్తలు
-
Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
-
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
-
Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!