దేవాలయాలే టార్గెట్‌గా దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. సీసీ కెమెరాలను సైతం లెక్క చేయకుండా హుండీలను బద్దాలు కొట్టి దేవుడు సొమ్ములు కొట్టేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని ఒకే రోజు మూడు దేవాలయాల్లో దొంగలు హుండీ పగులకొట్టి చోరీలకు పాల్పడిన ఘటన కలకలం రేపుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం గజ్జరం అడ్డ రోడ్డులో జరిగిన దొంగతనాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. కనక దుర్గమ్మ గుడి, గోపవరం సమీపంలో మేరీమాత విగ్రహం దగ్గర అలాగే మరో ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు.
Also Read : Rain in Telangana: తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం.. వికారాబాద్‌లో వడగండ్ల వాన
దేవాలయాల వద్ద సీసీ కెమెరాలు ఉన్నా దొంగలు భయపడకుండా చోరీకి పాల్పడటం భయాందోళన గురిచేస్తున్నాయి. భక్తులు హుండీలో వేసిన డబ్బులను దోచుకెళ్లారు చోరీ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాళ్లపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీలకు పాల్పడింది పాత నేరస్థులుగా పోలీసులు భావిస్తున్నారు.
Also Read : Kishan Reddy: కేసీఆర్ సారూ ఎన్నోసార్లు లేఖలు రాశా.. ఇప్పటికైనా వాటిపై..