ఏపీలో ఓ దొంగల ముఠా రెచ్చిపోయింది. కర్నూలు జిల్లాలో హర్యానా దొంగల ముఠా ఓ ఏటీఎం దోపిడీకి విఫల యత్నం చేసింది. హర్యానా దొంగల ముఠా హల్ చల్ చేసింది. బాలాజీనగర్ లో ఏటీఎం దోపిడీకి ప్రయత్నం చేసింది. ఏటీఎంని బద్ధలు కొట్టి డబ్బులు కొట్టేసే ప్రయత్నం చేసింది. గ్యాస్ సిలిండర్, కట్టర్లు, స్ప్రేయర్లు తెచ్చిన ముఠా దోపిడీకి ప్లాన్ చేసింది. అయితే పోలీసు పెట్రోలింగ్ వాహనం రావడం గమనించిన ముఠా కాల్పులకు తెగబడింది. గ్యాస్ సిలిండర్, ఇతర సామాగ్రిని వదిలి పరారయింది. పోలీసులపై 3 రౌండ్ల కాల్పులు జరిపింది ముఠా.
Read Also: Ganta Srinivas Rao: గంటా ఇంట్లో కాపునేతల భేటీ.. ఏం జరుగుతోంది?
కాల్పులకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు. ముస్తఫా, తాహేర్ అరెస్ట్ అయిన వారిలో వున్నారు. వెంబడించిన పోలీసులపై మూడు రౌండ్లు కాల్పులు జరిపింది హర్యానా దొంగల ముఠా. ఈ దొంగల ముఠాలో ముస్తఫా(28), తాహెర్ (40) ని, ముస్తఫాని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈఘటనకు సంబంధించి మరో నలుగురు పరారయినట్టు చెబుతున్నారు.
ఊసగడ్డలో ఒంటరి ఏనుగు బీభత్సం
చిత్తూరు జిల్లాలో ఏనుగుల భయం వేధిస్తూనే వుంది. సోమల(మం)ఊసగడ్డలో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. మూడు పూరిగుడిసెలు, నిత్యావసర సరుకులపై దాడి చేసింది ఒంటరి ఏనుగు. దీంతో భయాందోళనలకు గురయ్యారు జనం. ఏనుగు దాడిలో పూర్తిగా నేలమట్టం అయ్యాయి మూడు పూరి గుడిసెలు. ఏనుగుల దాడుల నుండి తమను కాపాడాలని అధికారులకు విన్నవించుకుంటున్నారు స్థానికులు.
Read Also: Periods Time: ఆ.. టైంలో చాక్లెట్స్ తింటున్నారా? ఇది మీకోసమమే..