చాక్లెట్స్ అంటే చిన్నపిల్లల నుంచి అందరికి ఇష్టమే..

ఈ చాక్లెట్స్ను మహిళలు పీరియడ్స్ టైంలో తినవచ్చా అనే సందేహం ఉంటుంది.

 ఒకవేళ చాక్లెట్స్ తినాలనుకుంటే వాటిలో ఏ చాక్లెట్స్ తినవచ్చో తెలుసుకుందాం. 

నెలసరిలో మిల్క్ చాక్లెట్స్ కాకుండా డార్క్ చాక్లెట్స్ తినవచ్చు. 

డార్క్ చాక్లెట్స్ కోకో శాతం ఎక్కువ ఉంటుంది. 

షుగర్, పాలు తక్కువ ఉంటాయి. డార్క్ చాక్లెట్స్ ను నెలసరి టైంలో తీసుకుంటే..కార్డినోల్ స్థాయి తగ్గి, ఒత్తిడి లేకుండా చేస్తుంది.

ఇందులో విటమిన్ A, B1, C, D, E ఉంటాయి. 

ఇంకా ఫినాల్ తో పాటు ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఒమేగా 3,6 శరీరానికి అవసరమైన ఖనిజాలు ఉంటాయి.

దీంతో మహిళల్లో వచ్చే రుతుక్రమం ముందు, తర్వాత వచ్చే నెలసరి నొప్పిని తగ్గించడంతో పాటు, మైండ్సట్ను ప్రశాంతంగా ఉంచుతుంది.