Site icon NTV Telugu

Robbery : వారెవ్వా, ఎంత షార్ప్ గా రూ.40లక్షలు కొట్టేశారు

Robbers Steal Rs 40 Lakhs

Robbers Steal Rs 40 Lakhs

Robbery : ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బైకర్ నుండి రూ.40 లక్షలు దోచుకున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తన బైక్‌ను ఆపి ఆ వ్యక్తి బ్యాగ్‌లోని డబ్బును వారు దొంగిలిస్తున్నట్లు CCTV లో రికార్డైంది. మార్చి 1 సాయంత్రం భారీ ట్రాఫిక్‌ ఏర్పడింది. ఈ క్రమంలో జీబ్రాక్రాసింగ్ వద్ద జనాలు రోడ్డు దాటుతుండగా బైకర్ కార్ల మధ్య సిగ్నల్ పడడంతో బండి స్లో చేశాడు. వెంటనే ముగ్గురు వ్యక్తులు స్లో చేస్తున్న బైకరును చుట్టుముట్టి అనుసరించడం మొదలెట్టారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బైక్ స్లో కాగానే అతడికి తెలియకుండా, వారిలో ఒకరు తన భుజాలపై ఉన్న బ్యాక్‌ప్యాక్‌ని విప్పి, వేగంగా ఏదో బయటకు తీశాడు.

Read Also: Arogya Mahila: రాష్ట్ర మహిళలకు ప్రభుత్వ దీవెన.. నేడు ‘ఆరోగ్య మహిళ’కు శ్రీకారం..

వెంటనే ఆ ప్యాకెట్ ను అతను దానిని ఇతరులకు అందజేశాడు. మరికొన్ని సెకన్లలో వారు ప్రదేశం నుంచి మాయమయ్యారు. బైక్‌కు అంగుళాల దూరంలో కార్లు ఆపివేయబడినప్పటికీ, పాదచారులు దాని ముందు నడవడం వీడియోలో చూడవచ్చు. ముగ్గురిలో ఇద్దరిని అరెస్టు చేశారు. వారిని ఆకాశ్, అభిషేక్‌లుగా గుర్తించారు. ఈ బృందం బైకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చోరీకి గురైన రూ.40 లక్షల్లో రూ.38 లక్షలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version