NTV Telugu Site icon

Road Accident: రోడ్ టెర్రర్.. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Road Accident Pak

Road Accident Pak

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ట్రక్కు, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన ఓల్డ్ కంటోన్మెంట్ ప్రాంతంలోని మోరెనా హైవేపై తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం జరిగింది. కుటుంబ సమేతంగా ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Read Also: BSF: పాకిస్థాన్ ‘డ్రోన్’ కుట్ర.. 6 నెలల్లో 126 డ్రోన్లు కూల్చేసిన బీఎస్ఎఫ్‌

ఈ ప్రమాదంపై ఓల్డ్ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ధర్మేంద్ర చౌహాన్ మాట్లాడుతూ.. మోరెనా హైవేపై ఆటోను ట్రక్కు ఢీకొట్టిందని తెలిపారు. మృతుల కుటుంబం మొరెనాలోని బాన్‌మోర్‌లో నివాసముంటున్నదని.. భింద్ జిల్లాలో జరిగిన వివాహ వేడుక నుండి కుటుంబం మొత్తం తిరిగి వస్తోండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

Read Also: Delhi: ఢిల్లీ వైద్యుల అరుదైన సర్జరీ.. గుండెలోంచి నిమ్మకాయంత కణితి తొలగింపు

ప్రమాదం జరిగిన వెంటనే.. ఘటనాస్థలి నుంచి ట్రక్కు డ్రైవర్ పారిపోయాడని ధర్మేంద్ర చౌహాన్ పేర్కొన్నారు. దీంతో.. డ్రైవర్ పై అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంతో పాటు ఇతర నేరాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను 52 ఏళ్ల నరేష్ వాల్మీకి, అతని భార్య ఉష (45), అతని కుమారుడు రాహుల్ (25), మేనకోడలు అంకిత (16)గా గుర్తించారు. మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడ్డ ఆటో డ్రైవర్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.