Site icon NTV Telugu

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

Road Accident

Road Accident

Road Accident: అనంతపురం జిల్లా శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైరు పగిలి లారీని ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 6 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా అనంతపురం ఇస్కాన్‌కి చెందిన వారిగా సమాచారం. అనంతపురం – కడప హైవేపై ఘటన చోటుచేసుకుంది. తాడిపత్రి నగరంలో ఇస్కాన్ నగర సంకీర్తనకి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. తాడిపత్రి నుంచి అనంతపురంకు కారు వస్తోంది. మృతులు సంతోష్, షణ్ముక్, వెంకన్న, శ్రీధర్, ప్రసన్న, వెంకీలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also: Manoj Sinha: “ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం”.. ఉగ్రవాదులకు హెచ్చరిక

అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శింగనమల మండలం నాయనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురంనకు చెందిన ఆరుగురు ఇస్కాన్ టెంపుల్ భక్తులు దుర్మరణం చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Exit mobile version