పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ రిలీజ్ హరిహర వీరమల్లు. పిరియాడికల్ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా జులై 24న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. దాదాపు మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ సినిమా వస్తుండడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన వీరమల్లు ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ పవర్ స్టార్ క్రేజ్ తో తొలిరోజు వరల్డ్ వైడ్ గా రూ. 70 కోట్ల రేంజ్ ఓపెనింగ్ అందుకుంది.
Also Read : Coolie : అఫీషియల్.. కూలీ డే 1 కలక్షన్స్.. రికార్డ్స్ బద్దలు కొట్టిన రజనీ
ఇంతవరకు ఓకే కానీ మొదటి రోజు వచ్చిన నెగిటివ్ టాక్ సినిమా వసూళ్లపై భారీగా ప్రభావం చూపించింది. పవర్ స్టార్ కమ్ బ్యాక్ సినిమా కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ రేటుకు థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు చేసారు. కానీ ప్లాప్ టాక్ కారణంగా రెండవ రోజునుండే వసూళ్లు తగ్గాయి. మొదటి వారంలోనే ఈ సినిమా రన్ ముగిసింది. అన్ని ఏరియాలలో బయ్యర్స్ కు భారీ నష్టాలు వచ్చాయి. నైజాం మైత్రి కాబట్టి పవర్ స్టార్ మాట కాబట్టి వాళ్ళు సైలెంట్ గా ఉండే అవకాశం ఉంది. కానీ ఏపీలోని ఉత్తరాంధ్ర, నెల్లూరు, గుంటూరు, కృష్ణ వంటి ఏరియాలు భారీ నష్టాలు వచ్చాయి. ఇప్పుడు జిఎస్టీలు కట్టాలని కొందరు బయ్యర్స్ నిర్మాత ఏ ఎం రత్నం కలవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఏ ఎం రత్నం ఎవరికీ అందుబాటులో లేరట. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎటుంవంటి మలుపు తిరుగుతుందో అని ట్రేడ్ వర్గాలలో ఒకటే డిస్కషన్.