NTV Telugu Site icon

RK Roja : శ్రీవారి లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామం

Roja

Roja

సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా విచారణ జరపాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయం జస్టిస్ బీఆర్ గవాయ్ , జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం అందించిన విచారణలో వెలువడింది, ఇది ఈ రోజు ఉదయం జరిగింది. ఈ కేసు గురించి సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సమీక్షించడం జరిగింది. అయితే.. దీనిపై మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూ ప్రసాదాల వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామన్నారు. సుప్రీం తీర్పుతో అయినా సున్నితమైన భక్తుల మనోభావాలతో కూడుకున్న శ్రీవారి ప్రసాదాల విషయంలో రాజకీయ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు అందరూ మానుకుంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

Jr NTR: డైరెక్టర్ కొర‌టాల శివ‌పై తార‌క్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు

మొదటి నుంచి మేము భావిస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రే విచారణ, ఆధారాలతో సంబంధం లేకుండా రాజకీయ ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారి పరిధిలోని విచారణతో నిజాలు బయటికి రావని స్వతంత్ర దర్యాప్తు సంస్థ కావాలని కోరుకున్నామని, కేంద్ర ప్రభుత్వం కూడా సిట్ సరిపోదని, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో విచారణ జరగాలనే వాదనతో మా డిమాండ్కు విశ్వసనీయత పెరిగిందన్నారు రోజా. సుప్రీం పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తుతో వాస్తవాలు బయటికి వస్తాయని, తద్వారా గాయపడిన కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని పునరుద్ధరించినట్టు అవుతుందని తిరుపతి ఆడబిడ్డగా నమ్ముతున్నానన్నారు.

Prabhas : ఫౌజి సెకండ్ షెడ్యుల్ స్టార్ట్.. ప్రభాస్ వచ్చేది ఎప్పుడంటే..?