‘మిరాయ్’ సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని హీరోయిన్ రితికా నాయక్ చెప్పారు. విభా లాంటి అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారికి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారికి థాంక్యూ చెప్పారు. విభా చాలా స్పెషల్ క్యారెక్టర్ అని, తన మనసులో ఈ క్యారెక్టర్ ఎప్పుడూ గుర్తుండిపోతుందన్నారు. మంచు మనోజ్ సర్ అద్భుత పెర్ఫార్మర్ అని, జీరో తేజ సజ్జా వెరీ డెడికేటెడ్ అని రితికా నాయక్ కితాబిచ్చారు. తేజ, మనోజ్ కీలక పాత్రల్లో కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిరాయ్. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
మిరాయ్ ఘన విజయం అందుకున్న నేపథ్యంలో చిత్రబృందం ఈరోజు హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్లో రితికా నాయక్ మాట్లాడుతూ… ‘ అందరికి నమస్కారం. మిరాయ్ సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మా నిర్మాత విశ్వ ప్రసాద్ గారికి, కృతి ప్రసాద్ గారికి స్పెషల్ థాంక్యూ. వాళ్లు ఈ సినిమాకి ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా నిలబడ్డారు. నాకు విభా లాంటి అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ కార్తిక్ గారికి థాంక్యూ. ఇది చాలా స్పెషల్ క్యారెక్టర్, నా మనసులో ఎప్పుడూ నిలిచిపోతుంది. మనోజ్ గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. తేజ వెరీ డెడికేటెడ్, చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు. టీమ్ అందరికీ థాంక్యు’ అని అన్నారు.
Also Read: Crime News: లవర్ మోజులో పడి.. కన్న కూతురునే కడతేర్చిన కసాయితల్లి!
డైరెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ… ‘2021లో ఈ సినిమా ఐడియా తేజకి చెప్పాను. అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాం. నాలుగేళ్లు జర్నీ అంత ఈజీ కాదు. నన్ను బిలీవ్ చేసిన నిర్మాత విశ్వ ప్రసాద్ గారికి థాంక్యు. మనోజ్ గారితో కలిసి షూట్ చేయడం మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాకి రైటింగ్ వెరీ లాంగ్ టైం ప్రాసెస్. మణి గారు నాతో మూడేళ్లు పాటు ఉన్నారు. ఈరోజు ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న మూమెంట్స్ అవన్నీ రైటింగ్ నుంచి వచ్చినవే. హరి గ్రేట్ మ్యూజిక్ ఇచ్చారు. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. జగపతి బాబు, జయరాం, శ్రీయ గారికి స్పెషల్ థాంక్స్. రానా గారు నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తున్నారు. అడగ్గానే ఈ ప్రాజెక్టులో భాగమైన ఆయనకి కృతజ్ఞతలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు’ అని చెప్పారు.