Site icon NTV Telugu

Riti Saha : విశాఖలో సంచలనం రేపుతున్న వెస్ట్ బెంగాల్ విద్యార్థిని అనుమానస్పద మృతి కేసు

Riti Saha

Riti Saha

విశాఖలో జులై 14న అనుమానాస్పద రీతిలో పశ్చిమ బెంగాల్ విద్యార్థిని రితి సాహ మృతి సంచలనం రేపుతోంది. గత నెల 14 వ తేదీన కాలేజీ అవరణలో అనుమానస్పద స్థితిలో మృతి చెందింది రితి సాహ(16). అయితే.. ఈ మేరకు పోలీసులు సెక్షన్ 174 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. కేసును నీరు గార్చే ప్రయత్నంలో కాలేజీ యాజమాన్యం వద్ద 3 లక్షలు రూపాయలు పోలీసులు లంచం తీసుకున్నారని తల్లిదండ్రుల ఆరోపణలు చేస్తున్నారు. లంచం తీసుకోవడం మాకు తెలుసు అంటున్న విద్యార్థిని తల్లిదండ్రులు వాదిస్తున్నారు. దీంతో.. కేసులోకి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంట్రీ ఇచ్చారు. మమత బెనర్జీ ఆదేశాలతో బెంగాల్ అధికారులు కదిలారు. ఆంధ్ర ప్రదేశ్ అడిషనల్ డీజీపీ నీ వివరాలు అడిగి తెలుసుకున్నారు వెస్ట్ బెంగాల్ అధికారులు.. సీపీ త్రివిక్రమ వర్మ ఆధ్వర్యంలో గోప్యంగా దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.

Also Read : Amazon Smart TV Offers: అమెజాన్‌లో 54 శాతం డిస్కౌంట్ ఆఫర్.. 10 వేలకే 40 ఇంచెస్ స్మార్ట్‌టీవీ!

పోలీసులు లంచం తీసుకున్నారు అని ఆరోపణ పై సీపీ త్రివిక్రమ వర్మ సీరియస్ అయ్యారు. బాధితులతో నేరుగా మాట్లాడిన సీపీ త్రివిక్రమ వర్మ.. 4వ పట్టణ పోలీసులు లంచం తీసుకోవడం సీసీ కెమెరాలు లో రికార్డ్ అయింది అని మృతురాలి తల్లిదండ్రులు వెల్లడించారు. తమ కూతురుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లిదండ్రుల ఆరోపించారు. అయితే.. స్థానిక పోలీసులు లంచం తీసుకున్నారని ఏకంగా బెంగాల్ సీఎంకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు.. అయితే..ఫోరెన్సిక్ రిపోర్ట్ అందాల్సి ఉందని విశాఖ పోలీసులు వెల్లడిస్తున్నారు.

Also Read :Amazon Smart TV Offers: అమెజాన్‌లో 54 శాతం డిస్కౌంట్ ఆఫర్.. 10 వేలకే 40 ఇంచెస్ స్మార్ట్‌టీవీ!

Exit mobile version