Rising Stars Asia Cup 2026: నవంబర్ 19 నుంచి మరో సమరం.. పాక్‌తో మ్యాచ్ ఎప్పుడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దోహా వేదికగా నవంబర్ 19 నుంచి 29 వరకు జరగనున్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్‌కు సంబంధించిన 15 మంది సభ్యులతో కూడిన ఇండియా-ఏ జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. రాబోయే 2027 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈసారి మ్యాచ్‌లను 50 ఓవర్ల ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈ జట్టులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, రింకూ సింగ్, హర్షిత్ రాణా వంటి ప్రముఖ ఆటగాళ్లకు చోటు దక్కింది.
ఇండియా-ఏ జట్టును గ్రూప్-బిలో ఉంచారు. ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు పాకిస్థాన్-ఏ, నేపాల్, యూఏఈ జట్లు ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్-ఎలో బంగ్లాదేశ్-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ, శ్రీలంక-ఏ జట్లు పోటీపడుతున్నాయి.
Also Read
- IPL Auction: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
- New Zealand Series: టీమిండియాకు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్ ఆడటం కష్టమే..!
- Team India: టీమిండియా జట్టులోకి వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. కెప్టెన్‌గా తిలక్ వర్మ..
- School Holidays: తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
ఈ టోర్నమెంట్లో భాగంగా నవంబర్ 20న ఉదయం 11:30 గంటలకు వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేపాల్‌తో భారత్-ఏ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత నవంబర్ 22న ఉదయం 11:30 గంటలకు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్-ఏతో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది. గత టోర్నమెంట్లో పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైన భారత్, ఈసారి ఎలాగైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. ఆ తర్వాత నవంబర్ 24న ఉదయం 11:30 గంటలకు యూఏఈతో భారత్-ఏ తలపడనుంది. గ్రూప్ దశ ముగిసిన తర్వాత నవంబర్ 26 మరియు 27 తేదీల్లో సెమీఫైనల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. నవంబర్ 29న గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌తో టోర్నమెంట్ ముగియనుంది. గత ఎడిషన్‌లో సెమీస్‌లోనే వెనుదిరిగిన భారత్-ఏ, ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని ఉత్సాహంగా ఉంది.
తాజావార్తలు
-
Rising Stars Asia Cup 2026: నవంబర్ 19 నుంచి మరో సమరం.. పాక్‌తో మ్యాచ్ ఎప్పుడంటే..
-
IPL Auction: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
-
New Zealand Series: టీమిండియాకు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్ ఆడటం కష్టమే..!
-
Dada: రక్తపాతం లేని రచ్చ.. బాలయ్య వర్సెస్ మనోజ్ ‘దాదా’ వార్!
-
Team India: టీమిండియా జట్టులోకి వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. కెప్టెన్‌గా తిలక్ వర్మ..
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!