Site icon NTV Telugu

Rishi Sunak : నేను నటించాలనుకోవట్లేదు.. కొత్త ఏడాదిలో కష్టాలు తప్పవు

Rishi Sunak

Rishi Sunak

Rishi Sunak : బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ న్యూ ఇయర్‎ను పురస్కరించుకుని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లల్లో ఈ ఏడాదిని యూకేకు కష్టకాలంగా అభివర్ణించారు. అయితే సమస్యలు తీరిపోలేదని, వచ్చే ఏడాదిలోనూ కొనసాగుతాయన్నారు. రాబోయే ఏడాదిలో దేశ సమస్యలు తీరిపోతాయని తాను చెప్పనన్నారు. తాను నటిస్తూ అబద్ధాలు చెప్పనన్నారు. కానీ, 2023 ప్రపంచ వేదికపై అత్యుత్తమ ప్రదర్శనకు బ్రిటన్‌కు ఒక అవకాశం ఇస్తుందని మాత్రం చెప్పగలనన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం.. బ్రిటన్‌ ముందున్న అతిపెద్ద సవాల్‌. కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో.. రష్యా ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగింది.

Read Also: Alok Sharma : భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం.. బ్రిటన్ రాజు చేతుల మీదుగా నైట్ హుడ్ అవార్డు

ఈ యుద్ధం బ్రిటన్‌తో పాటు యావత్‌ ప్రపంచంపై ఆర్థికంగా ప్రభావం చూపెట్టింది. బ్రిటన్‌ సైతం ఆ ప్రతికూలత నుంచి కోలుకోలేకపోయింది. ఇక్కడి పౌరులపై ఆ ప్రభావం పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే తన ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. అయినప్పటికీ.. అవి సహేతుకంగా ఉన్నాయని భావిస్తున్నట్లు చెప్పారు రిషిసునాక్. మూడు నెలల కిందట.. ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి విరామం లేకుండా పని చేస్తున్నామన్నారు. అందులో భాగంగా జాతీయ వైద్య సేవలను పునరుద్ధరించే పనులు వేగం పుంజుకుందని రిషి సునాక్‌ తెలిపారు. అలాగే.. అక్రమ వలసలను సైతం అడ్డుకుంటున్నామని, ప్రత్యేకించి నేరగాళ్లపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. రాబోవు రోజుల్లోనూ తమ దేశం ఉక్రెయిన్‌కు తమ మద్ధతుగా నిలుస్తుందన్నారు.

Exit mobile version