సెంచరీ సాధిస్తాడని అనుకున్న రిషబ్ పంత్ జస్ట్‌లో మిస్ అయింది. 99 పరుగుల వద్ద ఔటై అభిమానులను నిరాశపరిచాడు. 105 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో రాణించాడు. అంతకుముందు.. 150 పరుగులు చేసి ఔటైన సర్ఫరాజ్ ఖాన్ కూడా.. డబుల్ సెంచరీ సాధిస్తాడని అనుకున్నారు. కానీ అతను కూడా 150 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఏదేమైనప్పటికీ భారత్ రెండో ఇన్నింగ్స్‌లో అందరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.