NTV Telugu Site icon

Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్ ను వీడిన పంత్.. 9ఏళ్ల ప్రయాణంపై ఎమోషనల్‌ పోస్టు (వీడియో)

Rishabhpant

Rishabhpant

స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC)ని వీడాడు. పంత్ ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరపున ఆడనున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పంత్‌ను ఏకంగా రూ. 27కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అయితే.. ఈ స్టార్ బ్యాట్స్ మెన్ 2016లో ఢిల్లీ ఫ్రాంచైజీ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. తాజాగా రిషబ్ .. డీసీ నుంచి విడిపోవడంపై మంగళవారం భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నాడు.

READ MORE: Sambhal Violence: ముస్లింలను రెచ్చగొట్టిన “సమాజ్‌వాదీ” ఎంపీ.. సంభాల్ హింసపై ఎఫ్ఐఆర్..

‘‘ఢిల్లీ జట్టుతో తొమ్మిదేళ్ల నా ప్రయాణం చాలా అద్భుతమైంది. చిన్న వయసులో ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాను. ఎన్నో ఉత్కంఠభరితమైన క్షణాలను గ్రౌండ్‌లో ఎదుర్కొన్నాను. నేను నేర్చుకున్న ప్రతీది నా అభివృద్ధికి ఎంతగానో సహాయపడింది. ఢిల్లీతో నా ప్రయాణం.. నాకెంతో విలువైంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా అభిమానులు నాకు అండగా ఉన్నారు. తాజాగా నేను ముందుకు వెళ్తున్నప్పటికీ .. మీ ప్రేమాభిమానాలు నా హృదయంలో అలాగే ఉండిపోతాయి. మా ప్రదర్శనతో మైదానంలో మిమ్మల్ని ఉత్సాహపరిచేందుకు కృషి చేస్తూనే ఉంటా. ఈ నా ప్రయాణాన్ని ఇంత ప్రత్యేకంగా మార్చినందుకు అందరికీ ధన్యవాదాలు’’ అంటూ భావోద్వేగంతో పోస్ట్ షేర్ చేసుకున్నాడు.

READ MORE:Fire Accident In Sofa Manufacturing Factory: సోఫా తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవదహనం

కాగా.. రిషబ్ పంత్ పోస్ట్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌ సహ యజమాని పార్త్ జిందాల్ కూడా ఓ భావోద్వేగ పోస్ట్‌ పంచుకున్నారు. పార్థ్ జిందాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో.. “రిషబ్ పంత్.. నువ్వు ఎప్పుడూ నా తమ్ముడిగా ఉంటావు. నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. మీరు సంతోషంగా ఉన్నారని, మిమ్మల్ని నా కుటుంబీకుడిలా చూసుకోవడానికి నేను నా వంతు ప్రయత్నం చేశాను. మీరు వెళ్లడం చూసి నేను కూడా చాలా బాధపడ్డాను. చాలా భావోద్వేగానికి లోనయ్యాను. మీరు ఎల్లప్పుడూ ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఉంటారు. ఏదో ఒక రోజు మనం తిరిగి కలుస్తామని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు రిషబ్.. మేము ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటామని గుర్తుంచుకోండి. బాగా ఆడండి.. ప్రపంచం మీ పాదాల వద్ద ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున మీకు శుభాకాంక్షలు.” అని రాసుకొచ్చారు.